*చిచ్చురేపుతున్న సెటిల్‌మెంట్ కాగితం *పాత పాట- కొత్త పల్లవి
మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఎన్నికల వేళ సమీపిస్తుండటంతో ఇంతకాలం మౌనంగా ఉన్న విపక్షాలు అధికార పార్టీ అవినీతి, అక్రమాల పై గళం విప్పుతున్నాయి. నాగర్‌కర్నూల్ నియో జకవర్గం ప్రధాన పార్టీల నేతల మధ్య ఎంతో కాలంగా రాజకీయ విమర్శల పర్వం కొనసాగు తూనే ఉన్నా పక్షం రోజులుగా దాని తీవ్రత పెరుగుతున్నది. చలికాలం అతి చల్లని ప్రదేశమైన ఎతైన కొండపై ఉన్న ఉమామహేశ్వర క్షేత్రంలో టిఆర్‌ఎస్ నేతలు ఏర్పాటు చేసిన రాజకీయ చర్చా వేదిక, కార్యకర్తల సమావేశం విమర్శల పర్వం మరింత వేడిరగులుస్తున్నది. కాగా ఎంతో కాలం గా అధికార పార్టీపై బిజెపి,కాంగ్రెస్ పార్టీల నేతలు అవినీతి ఆరోపణల పర్వపర్వం కొనసాగిస్తున్నా అధికార పక్షం నుండి పెద్దగా వివరణ లేదు. నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డు స్థల వివాదంలో ఎంఎల్‌ఎ తల దూర్చిన విషయం సెటిల్‌మెంటు కాగితంలో ఎంఎల్‌ఎ మర్రిజనార్ధన్‌రెడ్డి, ఆయన అనుచరులు చేసిన సంతకాల కాగితాన్ని బిజెపి నేత నాగం జనార్ధన్‌రెడ్డి బహిరంగ పర్చడం, అది పత్రికలతోపాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఒక్క సారిగా టిఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందించడానికి ప్రదాన కారణంగా కనిపిస్తున్నది. ఈ విషయంలో నేరుగా ఎమ్మెల్యే మర్రి రంగంలోకి దిగి పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సెటిల్ మెంటు వ్యవహారంపై ఓ స్పస్టమైన వివరణ కాకుండా ఎదురు దాడికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నది .
అవినీతి ఆరోపణలపై సూటి జవాబేది ? : సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అధికార పార్టీపైన ప్రధానంగా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్, అల్లుడు హరీష్‌రావుల అవినీతిపై ఏకబిగిన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పనుల్లో జరుగుతున్న అవకతవకలతోపాటు వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలపై కూడా ఇవిగో ఆధారాలంటూ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కేంద్ర విజిలెన్స్‌కు కూడా లేఖలు రాసాడు. న్యాయ పోరాటంకూడా చేస్తున్నాడు.తాను చేసిన ఆరోపణలపై విచారణ జరిపి ంచాలని ,నిజమని తేలితే బాధ్యులపైనా తప్పని తేలితే తనపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా నాగం సవాలు విసిరారు. దీనిపై చర్చకు సిద్దమని కూడా పలు సమావేశాల్లో నాగం పదేపదే పిలుపు నిచ్చారు. పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టునీటిని డిండికి తరలించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఉమ్మడి జిల్లా టిఆర్‌ఎస్ నాయకులు ,అధికార పార్టీ ఎమ్మెల్యేలు ,మంత్రులు తొలుత వ్యతిరేకించి చివరి చేతగానివారు గా మారారని కూడా నాగం దుయ్య బడుతూ వస్తున్నారు. అయితే నాగం చేసిన ఆరోపణలు తప్పంటు ఎలాంటి వాదన అధికార పక్షంవైపునుండి రాలేదు. సరికదా అప్పుడప్పుడూ స్థానిక నేతలు వ్యక్తి గత ఆరోపణలతో ఎదురు దాడి చేయడంతోనే సరిపుచ్చుకుంటూ వచ్చారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న సర్కారి పెద్దలు గానీ ,నాగర్‌కర్నూల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేగానీ , అధికారులు గానీ ఇది తప్పు అంటూ చిన్న ఆధారాలతో ఖండించిన దాఖలాలు లేవు.
మార్కెట్ మంటలు : నాగర్‌కర్నూల్‌లో నూతనంగా కడుతున్న మార్కెట్ యార్డ్ నిర్మాణ స్థలంలో ఏర్పడిన భూవివాదం కోర్టులో కేసునడుస్తుండగానే నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రిజనార్థన్ రెడ్డి అందులో సెటిల్ మెంటు చేస్తున్నా డని, దీనికి సంబందించి రూ. 50లక్షలు తనవద్ద ఉంచుకున్నాడని మూడేళ్లు ఆడబ్బులు తన వద్ద వుంచుకోవడమేగాక ప్రస్తుతం సెటిల్ మెంటు రేటు పెంచి మూడున్నర కోట్లకు పెంచాడని నాగం తాజాగా ఆరోపించారు. దీంతోపాటు స్వయానా ఎమ్మెల్యే మర్రి సంతకం చేసిన సెటిల్ మెంటు స్లిప్‌ను కూడా ఆయన పత్రికలకు విడుదల చేయడం , సంచలనం రేపింది. సెటిల్ మెంటు స్లిప్‌లో ఎమ్మెల్యే వద్ద ఉన్న రూ. 50లక్షల ప్రస్తావన లేకపోవడంపై కూడానాగం ప్రశ్ని ంచారు. ఇది గులాబీ నేతల్లో గుబులు రేపింది. వెంటనే ఎమ్మెల్యే మర్రి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి సెటిల్ మెంటు ఆరోపణలకు సమాధానం కాకుండావ్యక్తిగత ఆరోపణలకు దిగడమేగాక ఉమామహేశ్వర క్షేత్రంలో చర్చా వేదిక ఏర్పాటు చేశా రమ్మంటూ ఏక పక్షంగా సవాలు చేశారు.తాను వెలుతు న్నానంటూ పరుగులు పెట్టారే గానీ తన సవాలును స్వీకరిం చారా? మరేదైనా వేదిక, సమయానికి అవకాశం అడుగుతారా అంటూ కనీస సమా ధానం కోసం కూడా వేచి చూడకుండా లేచిందే లేడికి అన్నట్లు పరుగు పెట్టారు. ఇంత కాలం ప్రాజెక్టులు,మిషన్‌భగీరథపై చేసినవేలకోట్లకుంభకోణంపై స్పందించని గులాబీ నేతలు సెటిల్ మెంటు ఆరోపణ,దానికి ఆధారంగా ఎమ్మెల్యే సంతకంతో కూ డిన కాగితం బయట పెట్టగానే తీవ్రంగా వ్యక్తి గత ఆరోపణలకు తెరలేపారు.
పాత పాట-కొత్తపల్లవి : ఎంఎల్‌ఎ మర్రిజనార్ధన్‌రెడ్డిపై మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి సూటిగా పలు అంశాలపై సందిందిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వవల్సిందిపోయి ఎదురు దాడికి దిగడం కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న వ్యక్తి పైవచ్చే ఆరోపణల విషయంలో ఎంతో నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందన్నది పలువురి భావన. వివరణ ఇచ్చే క్రమంలో తాను చేసిన పనులను కూడా చెప్పుకోవడం కొత్తేమి కాదు అయితే అలా గాక ఎప్పుడో నాగం అధికారంలో ఉండగా అప్పటి ప్రతి పక్ష నాయకులు చేసిన ఆరోపణ లను తిరగదోడి అదేదో ఇప్పుడే జరిగినట్లు జవాబు చెప్పాలంటూ సవాలు చేయడం చూస్తే పాత పాటకు కొత్త పల్లవి అందుకున్నట్లు గానే కనిపిస్తున్నదన్న భావన సర్వత్రా వ్యక్త మవుతున్నది.