Home తాజా వార్తలు టాప్ 7 కంపెనీ మార్కెట్ విలువ

టాప్ 7 కంపెనీ మార్కెట్ విలువ

Market value of top 7 firms jump Rs by 1.29 lakh cr

 

రూ.1.29 లక్షల కోట్లు పెరిగింది..

ముంబై : గత వారం టాప్ 10 కంపెనీల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ.1,29,047.61 కోట్లు పెరిగింది. వీటిలో ఐటి దిగ్గజం టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) అత్యధికంగా లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ క్షీణించింది. టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికొస్తే రూ.71,761 కోట్లు పెరిగి రూ.13,46,325 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.18,693 కోట్లు పెరిగి రూ.7,29,618 కోట్లకు చేరగా, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ.16,082 కోట్లు పెరిగి రూ.4,26,753.27 కోట్లకు పెరిగింది. ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలువ రూ.12,744 కోట్లు పెరిగి రూ.8,38,402 కోట్లకు చేరగా, హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ రూ.5,393.86 కోట్లు పెరిగి రూ.5,01,562.84 కోట్లకు పెరిగింది. ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వాల్యుయేషన్ రూ.2,409.65 కోట్లు పెరిగి రూ.4,22,312.62 కోట్లకు చేరింది.

హిందుస్థాన్ యూనిలీవర్ గత వారంలో రూ.1,961.91 కోట్ల లాభాన్ని ఆర్జించడం వల్ల కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,50,532.73 కోట్లకు పెరిగింది. వీటికి భిన్నంగా భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ.10,489.77 కోట్లు తగ్గి రూ.3,94,519.78 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ విలువ రూ.3,686.55 కోట్లు క్షీణించి రూ.4,97,353.36 కోట్లకు చేరగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,537.34 కోట్లు నష్టపోయి రూ.15,27,572.17 కోట్లకు క్షీణించింది. టాప్ 10 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత వరుసగా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి. గత వార్ంల సెన్సెక్స్ 589.31 పాయింట్లు లేదా 1.03 శాతం పెరిగింది.

Market value of top 7 firms jump Rs by 1.29 lakh cr