Home తాజా వార్తలు రెండో రోజూ నష్టాలు

రెండో రోజూ నష్టాలు

Markets end lower for 2nd day in row

 

456 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మెటల్స్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి వంటి కన్జూమర్‌కు సంబంధించిన స్టాక్స్‌లో లాభాల స్వీకరణ వల్ల వరుసగా రెండో రోజు మార్కెట్లు నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమైంది. కానీ ఆఖరికి భారీగా నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు కోల్పోయి 61,259 పాయింట్లకు పడిపోయింది. ఇక నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 18,266 పాయింట్ల వద్ద ముగిసింది. ఒడిదుడుకుల్లోనూ భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బిఐ షేర్లు మంచి లాభాలను చూశాయి. టైటాన్, హిందుస్తాన్ యునిలివర్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టిపిసి, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎల్ అండ్ టి 2 శాతం వరకు నష్టపోయాయి. బిఎస్‌ఇలో 2,297 స్టాక్స్ నష్టపోగా, 1,004 స్టాక్స్ మాత్రమే పెరిగాయి.

Markets end lower for 2nd day in row