Thursday, April 25, 2024

భాగస్వామి స్టెల్లాను జైల్లోనే వివాహం

- Advertisement -
- Advertisement -
Married partner Stella in prison
చేసుకునేందుకు అసాంజెకు అనుమతి

లండన్: వికీలీక్స్ వ్యవస్థానకుడు జూలియన్ అసాంజే తన భాగస్వామి స్టెల్లా మోరిస్‌ను జైల్లోనే వివాహం చేసుకోవడానికి అనుమతి లభించినట్లు బ్రిటీష్ అధికారులు తెలిపారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజెను తమ దేశానికి అప్పగించాలని అమెరికా పట్టుబడుతున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనను 2019నుంచి లండన్‌లోని హై సెక్యూరిటీ బెల్‌మాష్ జైల్లో నిర్బంధంలో ఉంచారు. లైంగిక దాడి ఆరోపణలపై స్వీడన్‌ను అప్పగించకుండా తప్పించుకోవడం కోసం అసాంజె లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో ఏడేళ్లపాటు తలదాచుకున్న సమయంలో ఈ ఇద్దరి మధ్య బంధం ప్రారంభమైంది. దక్షిణాఫ్రికాలో జన్మించిన, లాయర్ అయిన మోరిస్, అసాంజెలకు ఇద్దరు కుమారులు నాలుగేళ్ల గాబ్రియెల్, రెండేళ్ల మాక్స్ కూడా ఉన్నారు. తమ వివాహానికి ఇక ఎలాంటి అడ్డంకులు ఉండబోవని భావిస్తున్నానని స్టెల్లా మోరిస్ వ్యాఖ్యానించారు. అసాంజెను తమకు అప్పగించాలన్న అమెరికా డిమాండ్‌ను గత జనవరిలో ఒక బ్రిటన్ జడ్జి తిరస్కరించారు.

అయితే అమెరికా అభ్యర్థన ఉన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్నందున ఆయనను జైల్లోనే ఉంచారు. కాగా 2020 ఏప్రిల్‌లో తమ రిలేషన్‌షిప్‌ను బహిర్గతం చేసిన అసాంజె, మోరిస్‌లు తాము వివాహం చేసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఈ ఏడాది జనవరిలో జైలు అధికారులకు లేఖ రాశారు. అంతేకాదు జైలు గవర్నర్, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్‌లు తమ వివాహం జరక్కుండా అడ్డుకుంటున్నారని వారు అరోపిస్తూ, వారిపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని కూడా హెచ్చరించారు. కాగా అసంజె దరఖాస్తు జైలు గవర్నర్‌కు అందిందని, అందరి దరఖాస్తుల్లాగానే ఆయన దరఖాస్తును కూడా పరిశీలించి పరిష్కరించారని ప్రిజన్ సర్వీస్ గురువారం తెలిపింది. కాగా వివాహం తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. పదేళ్ల క్రితం వేలాది మిలిటరీ, దౌత్య డాక్యుమెంట్లను వికీలీక్స్ బయటపెట్టడానికి సంబంధించిన కేసులో అమెరికా ప్రాసిక్యూటర్లు అసాంజెను 17 నేరాలలో దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News