- Advertisement -
మనతెలంగాణ/హుజూరాబాద్ టౌన్ ః
మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పంచకోట సంధ్య(25) బిక్షపతితో ఏడేళ్ల కింద వివాహాం జరిగింది. ఈ క్రమంలోనే బిక్షపతి మద్యానికి బానిస కావడంతో భార్య సంధ్య ఎన్నిసార్లు మందలించిన తాగుడు మానకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా భర్త బిక్షపతి అడ్డుకోగా అతను గాయాలపాలయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
- Advertisement -