Home జనగామ వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

committed suicide

జనగామ: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని వెంకిర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… జనగామ జిల్లా  వెంకిర్యాల గ్రామానికి చెందిన దుర్గం కీర్తన(23) అనే వివాహిత కుటుంబ కలహాతో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీర్తన భర్తే ఆమెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించడాని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని కీర్తన భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా వెల్లడించారు.

Married Woman committed suicide with family conflicts