Home ఆదిలాబాద్ అనుమానాస్పదంగా వివాహిత మృతి

అనుమానాస్పదంగా వివాహిత మృతి

Married Woman Suspicious Death

 

ఆదిలాబాద్: జిల్లాలోని బేల మండల కేంద్రంలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి వివాదాస్పదంగా మారిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  బేల మండలానికి చెందిన రాకేష్‌కు సొనాల గ్రామానికి చెందిన శ్రీదేవితో 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం వరకు భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్న తరుణంలో సోమవారం ఉదయం శ్రీదేవి మృతి చెందడం వివాదానికి కారణమైంది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు బేలకు చేరుకొని బోరును విలపించారు. శ్రీదేవిని భర్త రాకేష్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బేల ఎస్ఐ సాయన్న ఆందోళన కారులతో మాట్లాడి సమాధానపర్చడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

Married Woman Suspicious Death in Adilabad