Home జనగామ అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Married Women Suspected Dies In Jangoan District

జనగామ క్రైం : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన జనగామ పట్టణంలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన పల్లపు మమత (22) జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న శివరాత్రి శేఖర్‌తో సంవత్సరన్నర క్రితం వివాహం జరిగింది. పల్లపు యాశోద, నర్సింహులు దంపతుల కుమార్తెకు వివాహం చేసి కట్నం డబ్బులు 5 లక్షలు నగదు,10 తులాల బంగారం, 200 గజాల స్థలం వడ్లకొండ రోడ్‌లో ఇచ్చిపెళ్ళి పెద్దల సమక్షంలో చేశారని తెలిపారు. కొంత కాలంగా భార్యభర్తల మధ్య విభేదాలు, అత్తమామల అదనపు కట్నం కోసం వేధించారని తెలిపారు. తనకున్న రెండు ఎకరాల భూమి అమ్మి వారికిచ్చే కట్నం పూర్తిగా చెల్లించామని మృతురాలి తల్లి తెలిపారు. కాని భర్త అత్తమామలు కలిసి తమ కూతుర్ని కొట్టి చంపి ఉరి వేశారని ఆరోపించారు.
భర్త ఇంటి ముందు కుటుంబ సభ్యుల ధర్నా
తమ కూతుర్ని కొట్టి చంపి ఉరి వేశారని మృతురాలి తల్లి బంధువులు భర్త ఇంటి ముందు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి ఏసీపీ బాపురెడ్డి, సీఐ ముసికె శ్రీనివాస్, జనగామ ఎస్సై కె. శ్రీనివాస్, లింగాల ఘనపురం ఎస్సై వేణుగోపాల్ చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా ఏలాంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలపారు.
భర్త పురుగుల మందు త్రాగి ఆత్మహత్యా యత్నం
భార్య మృతిచెందడంతో ఇంటికి వచ్చిన భర్త తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడంతో స్థానికులు చికిత్స నిమత్తం హుటాహుటిన జనగామ ఏరియా తరలించారు. జనగామ వైద్యులు భర్త శేఖర్‌కు వైద్యసేవలు అందిస్తున్నారు.