Home ఆఫ్ బీట్ భూమికి మరింత దగ్గరగా మార్స్

భూమికి మరింత దగ్గరగా మార్స్

Mars

విశ్వంలో మరో అరుదైన వింత చోటుచేసుకోనుంది. 15 ఏళ్ల తర్వాత మరోసారి అరుణగ్రహం భూమికి దగ్గరగా రానుంది. సూర్యుడికి ఎదురుగా వచ్చి మరింత ప్రకాశవంతంగా కనిపించనుంది. జులై 27న ఈ వింత జరుగనున్నట్లు నాసా తాజాగా వెల్లడించింది. సూర్యుడికి ఎదురుగా రావడం వల్ల ఆ కాంతి మార్స్‌పై పడి అది ఎంతో ప్రకాశవంతంగా కనిపించనున్నట్లు తెలిపింది. సూర్యుడు, మార్స్ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండటాన్ని మార్స్ అపోజిషన్‌లో ఉండటం అని అంటామని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.  ప్రతి 15 నుంచి 17 ఏళ్లకు ఈ అపోజిషన్ ఏర్పడుతుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు.