Home తాజా వార్తలు గ్రామీణ మార్కెట్లలో మారుతీ 50 లక్షల సేల్స్

గ్రామీణ మార్కెట్లలో మారుతీ 50 లక్షల సేల్స్

Maruti suzuki crosses 50 lakh sales in rural markets

 

ముంబై : వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మరో మైలురాయిని సాధించింది. గ్రామీణ మార్కెట్లలో కీలక 50 లక్షల సేల్స్ మార్క్‌ను చేరుకుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంస్థకు 1700 ఔట్‌లెట్లు ఉండగా, మొత్తం సేల్స్‌లో 40 శాతం గ్రామాల నుంచి వస్తోంది. ఇప్పటికే కంపెనీ నెట్‌వర్క్ నెక్సా షోరూమ్‌లలో ప్రీమియం సేల్స్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, ప్రత్యేకంగా 12,500 మంది శిక్షణ పొందిన డీలర్‌షిప్‌లతో కంపెనీ ‘గో లోకల్’ అనే నినాదంతో ముందుకు సాగుతోందని, స్థానిక సంప్రదాయాల మేరకు కస్టమర్లకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకొచ్చామని అన్నారు.

Maruti suzuki crosses 50 lakh sales in rural markets