Home తాజా వార్తలు ఈ నెలాఖరున మారుతీ కొత్త కారు ఎస్‌ప్రెస్సో

ఈ నెలాఖరున మారుతీ కొత్త కారు ఎస్‌ప్రెస్సో

Maruti Suzuki

 

న్యూఢిల్లీ : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రస్తుతం కొత్త హాచ్‌ బ్యాంక్ ఎస్‌ ఎస్-ప్రెస్సోపైనే దృష్టి పెట్టింది. ఈ కారు సెప్టెంబర్ 30న లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎస్‌యువి ఎస్-ప్రెస్సోను ఇటీవల ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. మారుతీ ఎస్-ప్రెస్సో ఎంట్రీ లెవల్ కారు. కంపెనీ నాలుగు వేరియంట్‌లలో ఈ కారును మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోకు పవర్ 68 హెచ్‌పి, టార్క్ 90 ఎన్‌ఎమ్ కలిగిన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. మారుతి దీనిలో సిఎన్‌జి మోడల్‌ను కూడా అందించనుంది. ఎస్-ప్రెస్సో స్పోర్టిగా కనిపిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ .4 లక్షలు ఉండవచ్చని తెలుస్తోంది. రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .2.76 లక్షలు.

Maruti Suzuki S Presso launched on September 30