Home తాజా వార్తలు మారుతీ సేల్స్ 2 శాతం డౌన్

మారుతీ సేల్స్ 2 శాతం డౌన్

Maruti-Suzuki

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విక్రయాలు నవంబర్‌లో పేలవంగా ఉన్నాయి. గత నెలలో సంస్థ విక్రయాలు 1.9 శాతం తగ్గి 1,53,539 యూనిట్లు నమోదు చేశాయి. దేశీయంగా సంస్థ విక్రయాలు 1.6% తగ్గి 1,43,686 యూనిట్లు నమోదు చేయగా, గతేడాది(2018)లో ఈ సేల్స్ 1,46,018 యూ నిట్లుగా ఉన్నాయి. ఆల్టో, వాగనర్ ఆర్ వంటి మినీ కార్ల అమ్మకాలు 29,954 యూనిట్ల నుం చి 26,306 యూనిట్లకు తగ్గాయి. అంటే 12.2 శాతం క్షీణించాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడల్స్‌తో సహా కాంపాక్ట్ సెగ్మెంట్ సేల్స్ 7.6 శాతం పెరిగాయి.

గతేడాది నవంబర్‌లో 72,533 యూనిట్ల నుంచి ఈ ఏడాది అదే నెలలో 78,013 యూనిట్లకు పెరిగాయి. మధ్యశ్రేణి సెడాన్ సియాజ్ విక్రయాలు 3,838 యూనిట్ల నుంచి 1,448 యూనిట్లకు తగ్గాయి. విటారా బ్రెజ్జా, ఎస్‌క్రాస్, ఎర్టిగా వంటి యుటిలిటీ వెహికిల్స్ విక్రయాలు 1.3 శాతం తగ్గాయి. 23,512 యూనిట్ల నుంచి 23,204 యూనిట్లకు తగ్గాయి. నవంబర్‌లో ఎగుమతులు 7,521 యూనిట్ల నుంచి 6,944 యూనిట్లతో 7.7 శాతం క్షీణించాయి.

37 ఏళ్లలో రెండు కోట్ల కార్ల విక్రయం

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి డిసెంబర్ 14న 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 1983లో సంస్థ మొట్టమొదటి మారుతి 800 మోడల్‌ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ మొత్తం రెండు కోట్లకు పైగా వాహనాలను విక్రయించింది. సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ కొత్త రికార్డును సృష్టించామని తెలిపింది. సంస్థ 1 కోటి వాహనాలను విక్రయించడానికి 29 సంవత్సరాలు పట్టిందని, అయితే తర్వాత 1 కోటి వాహనాలు ఎనిమిదేళ్ళలో అమ్ముడయ్యాయని సంస్థ తెలిపింది.

ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సిఇఒ కెనిచి ఆయుకావా మాట్లాడుతూ, ఈ కొత్త రికార్డు చూసి చాలా సంతోషిస్తున్నామని అన్నారు. ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జి వాహనాల తర్వాత ఇప్పుడు స్మార్ట్ హైబ్రిడ్ వాహనాలను తయారు చేస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. ఇవి కాకుండా ఎనిమిది బిఎస్ 6 మోడళ్లు కూడా మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించారు. అదే సమయంలో సుజుకి మోటార్ కార్పొరేషన్ ఒక చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయబోతోంది. మారుతి ఆల్టో గత 15 సంవత్సరాలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఘనతను సాధించింది.

Maruti Suzuki sales fall again in November