Thursday, April 25, 2024

ఒకప్పటి రవితేజ గుర్తుకువస్తాడట

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. సినిమా చూపిస్తా మావా, నేను లోకల్ వంటి విజయవంతమైన సినిమాలకు స్టోరీ అందించిన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పిన స్టోరీ రవితేజకు నచ్చిందట. దీంతో త్రినాథరావు , ప్రసన్న కుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా… ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. పీపుల్స్ మీడియా బ్యానర్ పై విశ్వప్రసాద్, – వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే మెగాస్టార్ చిరంజీవి, – హాస్యబ్రహ్మ జంధ్యాల కాంబినేషన్‌లో వచ్చిన ’చంటబ్బాయి’ సినిమా ఇన్‌స్పిరేషన్ గా ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాసుకున్నారట.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్‌తో ఒకప్పటి రవితేజ గుర్తుకువస్తాడట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News