- Advertisement -
ఒడిశా: తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(14)ని గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ సంఘటన బౌద్ జిల్లా కాంటమాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కోడిబాహల్ గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం విద్యార్థిని తన మామ ఉండే గ్రామంలో ఓ వివాహానికి హాజరయ్యింది. తన అత్తతో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లింది. అయితే దీన్ని గమనించిన ఇద్దరు నిందితులు బాలికను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు వేంటనే అక్కడి నుండి పారిపోయరు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -