Home తాజా వార్తలు మహిళపై సామూహిక అత్యాచారం

మహిళపై సామూహిక అత్యాచారం

Mass Rape

 

నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

సిద్దిపేట : మహిళపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన సిద్దిపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా దుండిగల్‌కు చెందిన మహిళతో సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలకిషన్‌రెడ్డికి గత తొమ్మిది సంవత్సరాలుగా పరిచయం ఉంది. దీంతో ఈ నెల 21న దుండిగల్ వెళ్లిన బాలకిషన్‌రెడ్డి తన ద్విచక్ర వాహనంపై అరుణను అదేరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో సిద్దిపేటకు తీసుకువచ్చాడు.

ఈ క్రమంలో సిద్దిపేటకు చేరుకున్న బాలకిషన్‌రెడ్డి తన మిత్రుడైన రంజిత్‌రెడ్డికి ఫోన్ చేసి ఆ మహిళను తనతో తీసుకెళ్లాలని కోరాడు. అక్కడికి చేరుకున్న రంజిత్‌రెడ్డి ఆమెను గణేష్‌నగర్‌లో నివాసం ఉంటున్న మరో మిత్రుడు ప్రణీత్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో ప్రణీత్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి అదే రాత్రి 12 గంటల ప్రాంతంలో బాలకిషన్‌రెడ్డికి అప్పగించారు. అనంతరం బాలకిషన్‌రెడ్డి ఆమెను వేరేచోటుకు తీసుకెళ్లి అత్యాచారం చేసి తెల్లవారుజామున పాత బస్టాండ్ సమీపంలో వదిలివెళ్లాడు.

గురువారం సాయంత్రం బాధితురాలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా బాలకిషన్‌రెడ్డి 2013లో ఐడీఏ బొల్లారంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని, అలాగే రంజిత్‌రెడ్డి, ప్రణీత్ రెడ్డిలు సైతం 2013లో మోహినాబాద్‌లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

Mass Rape on Woman