Thursday, April 25, 2024

అమెరికాలో కాల్పులు: 9 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఫ్లోరిడాలో నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో 9 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఫేస్ మాస్కులు ధరించి కారులో వచ్చిన దుండగులు విండోల్లో నుంచి విచక్షరహితంగా కాల్పులు జరిపారని సంబంధిత అధికారులు వెల్లడించారు. కారులో నలుగురు షూటర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News