Home తాజా వార్తలు సామూహిక వివాహ వేడుక.. ఒక్కటైన 165 జంటలు

సామూహిక వివాహ వేడుక.. ఒక్కటైన 165 జంటలు

wedding ceremony

 

నాగర్‌కర్నూల్‌ : నాగర్‌కర్నూల్‌ జెడ్పీ మైదానంలో కల్యాణ మహోత్సవం జరిగింది. ఒకే ముహూర్తంలో 165 జంటలు ఒక్కటయ్యాయి. 2012 నుంచి ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఎంజేఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహా వేడుకలకు మంత్రి హరీశ్‌ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వధూవరుల బంధు మిత్రులు వేలాదిగా తరలివచ్చారు. నూతన జంటలకు రూ.75వేల విలువైన వస్తువులను ఎమ్మెల్యే జనార్ధన్‌ రెడ్డి బహుమతిగా ఇస్తున్నారు. ‘ఆడపిల్లల పెళ్లంటే ఎంత కష్టమో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలుసు. అందుకే కల్యాణ లక్ష్మీ పథకం తీసుకొచ్చారు. మంచి పనికి భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహమని’ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

Mass wedding ceremony at Nagarkurnool