Home తాజా వార్తలు కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

Massive fire breaks out at cotton mill in kalwakurthy

 

నాగర్‌కర్నూల్ : కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గ్రామ శివారులో గల గణేష్ జిన్నింగ్ మిల్లులో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిసిఐ ద్వారా కొనుగోలు చేసిన సుమారు 25వేల క్వింటాళ్ల పత్తి దగ్ధం కావడంతో 15 కోట్ల దాకా నష్టం వాటిల్లిందని సిసిఐ అధికారి వరుణ్ రెడ్డి తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న పత్తిని మిల్లు ఆవరణలో కుప్పలుగా పోశారు. వాహనాలు తిరుగుతున్న క్రమంలో ఒక విద్యుత్ తీగకు షార్ట్ సర్కూట్ కావడం వల్ల మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా మంటల్లో కాటన్ మిల్లు మిషనరీ సైతం మంటల్లో కాలిపోయినట్లు తెలిసింది.

అగ్ని మాపక సిబ్బంది 5 వాహనాలతో మంటలను ఆర్పుతున్నారు. సంఘటన స్థలం వద్ద ఆర్డిఓ రాజేష్ కుమార్, డిఎస్పి గిరిబాబు, తహసిల్దార్ రాంరెడ్డి, సిఐలు సైదులు, నాగరాజు, ఎస్సైలు మహేందర్, బాలకృష్ణ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 11వ తేది నుంచి ఇప్పటివరకు 45వేల 875క్వింటాళ్ల పత్తి సిసిఐ ద్వారా కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు 26 కోట్ల రూపాయలు ఉంటుంది. కాగా పత్తి ఎంత మేరకు కాలింది, ఎంత నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.

Massive fire breaks out at cotton mill in kalwakurthy