Home తాజా వార్తలు నిండు కుండను తలపిస్తున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు

నిండు కుండను తలపిస్తున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు

Massive Flood Inflow to Nagarjuna Sagar Project

నల్గొండ : ఎగువ నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. నాలుగేళ్ల తరువాత ఈ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరడం ఇదే మొదటిసారి. ప్రాజెక్టులో నీరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా రావడంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 14వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న టెయిల్‌పాండ్‌కు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 595 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 586 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 312 టిఎంసిలు. ప్రస్తుతం 300 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో జలకళను సంతరించుకుంది. దీంతో సాగర్‌కు పర్యాటకుల తాకిడి అధికమైంది.

Massive Flood Inflow to Nagarjuna Sagar Project