Home తాజా వార్తలు సైనిక్ పురిలో భారీ చోరీ

సైనిక్ పురిలో భారీ చోరీ

Massive theft in Hyderabad Sainikpuri

మేడ్చల్: జిల్లాలోని సైనిక్ పురిలో ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో లాకర్లు పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. కుమారుడి వివాహం సందర్భంగా వ్యాపారి కుటుంబం షిర్డీకి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించారు. ఇంట్లోని బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరికి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు.  సుమారు రూ. 2కోట్ల విలువైన సొత్తు ఎత్తుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దుండగులు ఇంట్లోని బైక్ ను కిలీమీటరు దూరంలో వదిలి వెళ్లారు. అయితే వ్యాపారి ఇంట్లో పనిమనుషులపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఘటనాస్థలిలో క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

Massive theft in Hyderabad Sainikpuri