Home తాజా వార్తలు కెపిహెచ్‌బి కాలనీలో దొంగల స్వైరవిహారం

కెపిహెచ్‌బి కాలనీలో దొంగల స్వైరవిహారం

Thievesహైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు స్వైర విహారం చేశారు. శనివారం ఒక్క రోజే మొత్తం ఏడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ప్రగతినగర్‌లో ఆరో చోట్ల, కెపిహెచ్‌బి 7వ ఫేజ్‌లోని ఎల్‌ఐజి-2లో ఒకచోట చోరీకి పాల్పడ్డారు. కాగా, ప్రగతినగర్‌లోని ఒకే ఇంట్లో దొంగలు ఏకంగా 9లక్షల 50వేలు దోచుకెళ్లారు. కెపిహెచ్‌బి కాలనీలో జరిగిన చోరీలో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి రెండు ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.