Home తాజా వార్తలు నారాయణఖేడ్‌లో భారీ చోరీ

నారాయణఖేడ్‌లో భారీ చోరీ

Massive Theft In Narayankhed At Sangareddyసంగారెడ్డి : నారాయణఖేడ్‌లో సోమవారం రాత్రి  భారీ చోరీ జరిగింది. స్థానిక మార్వాడీ గల్లీ కాలనీలో తాళం వేసి ఉన్న  ఓ వ్యాపారి ఇంట్లో దుండగులు చోరీ చేశారు. ఈ క్రమంలో దుండగులు 10 కిలోల వెండి, 60 తులాల బంగారం, 4 లక్షల 50 వేల రూపాయిల నగదు అపహరించారు.  ఈ చోరీపై బాధిత వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.