Friday, April 19, 2024

భారీగా పెరిగిన గర్భ నిరోధకాల వాడకం

- Advertisement -
- Advertisement -
Massively increased use of contraceptives 
సంతానోత్పత్తి తగ్గుదలకు అదే ప్రధాన కారణం
 తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేపై నిపుణుల విశ్లేషణ

న్యూఢిల్లీ: భారత దేశ జనాభా తగ్గుముఖం పడుతున్నట్లు, మొత్తం సంతానోత్పత్తి రేటు(టిఎఫ్‌ఆర్), భర్తీ (రిప్లేస్‌మెంట్)స్థాయికన్నా తక్కువగా ఉన్నట్లు ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్5) వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ప్రధా న కారణం అవాంఛిత గర్భాలను నిరోధించడమేనని ఈ సర్వేను బట్టి అర్థమవుతుంది.. కేవలం అయిదేళ్ల వ్యవధిలో అంటే గత జాతీయ కుటుంబ సర్వే(201516), తాజా సర్వే (201920) మధ్య కాలంలో కుటుంబ నియంత్రణ కోసం ఆధునిక గర్భనిరోధకాల వాడకం ఏకంగా 8.7 శాతం అంటే 47.8 శాతంనుంచి 56.5 శాతానికి పెరిగింది. దేశంలోని మొత్తం 36రాష్ట్రాలకు గాను 30 రాష్ట్రాల్లో గర్భనిరోధక సాధనాల వాడకం పెరగ్గా, అత్యధిక జనాభా రాష్ట్రాలయిన బీహార్, ఉత్తరప్రదేశ్‌లో ఈ శాతం మెరుగుపడడం గమనార్హమని జనాభా, పునరుత్పత్తి ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బీహార్‌లో గర్భనిరోధక సాధనాల వాడకం గత అయిదేళ్ల కాలంలో దాదాపు రెట్టింపు అంటే 23.3 శాతంనుంచి 44.5 శాతానికి పెరిగింది. ‘గర్భధారణ తగ్గడం అనేది మూడు ప్రధాన అంశాలు గర్భనిరోధక సాధనాల వాడకం, వివా హ వయసు పెరగడం, అబార్షన్లుపై ఆధార పడి ఉంటుంది. బీహార్‌లో అమ్మాయిల వివాహ వయ సు ఇప్పటికీ 18 ఏళ్లకన్నా తక్కువగా ఉన్నప్పటికీ ఆధునిక గర్భనిరోధక సాధనాల వాడకం పెరగ డం విజయవంతమయింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కుటుంబ సంక్షేమ పథకాలు విజయవంతం కావడాన్ని ఇది ఎత్తి చూపుతోంది. అయితే రాష్ట్రం లో విద్యాస్థాయి పెరగడం, ఫలితంగా గర్భనిరోధకాల వాడకం, కుటుంబ నియంత్రణ పెరగడానికి కారణమయ్యాయి’ అని పాపులేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ డైరెక్టర్ డాక్టర్ నిరంజన్ సగ్గుర్తి అభిప్రాయపడ్డారు. మరో వైపు యుపిలో వివాహ వయసు పెరగడం దీనికి కారణం. ఇంతకు ముం దు సర్వే సమయంలో వివాహం చేసుకున్న 18 లోపు అమ్మాయిలు 21 శాతం ఉండగా, ఇప్పడది 5 శాతం తగ్గి 16 శాతానికి చేరుకుంది.

రాష్ట్రంలో గర్భ నిరోధకాలు ముఖ్యంగా కండోమ్‌ల వాడకం గణనీయంగా పెరిగిందని, ఇది చాలా మంచి పరిణామమని డాక్టర్ సగ్గుర్తి అంటున్నారు. రాష్ట్రం లో గర్భనిరోధక సాధనాల వాడకం ఈ అయిదేళ్ల కాలంలో దాదాపు 13 శాతం అంటే 31.7 శాతంనుంచి 44.5 శాతానికి పెరిగింది. గర్భనిరోధక సాధనాల వాడకం గణనీయంగా పెరిగిన రాష్ట్రాల్లో బీహార్, దాద్రా నాగర్ హవేలి, దామన్, డయ్యు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. కాగా ఎపి, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ హర్యానా, గోవా రాష్ట్రాల్లో గర్భనిరోధక సాధనాల వాడకం దాదాపు 60 శాతంగా ఉండ డం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News