Friday, June 13, 2025

టాలీవుడ్ లో విషాదం.. మాస్టర్ భరత్ కు మాతృ వియోగం

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ లో చైల్డ్ అర్టిస్ట్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని కన్నుమూశారు. తల్లి అకాల మరణంతో భరత్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి చెన్నైలో గుండెపోటు కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. భరత్ ధైర్యంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక, అభిమానులు, నెటిజన్స్ కూడా భరత్ కు ధైర్యం చెబుతూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News