Thursday, April 25, 2024

కొత్త ఆడిట్‌ను సమర్పించిన మాస్టర్‌కార్డ్

- Advertisement -
- Advertisement -

MasterCard submitted the new audit

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్)కు కొత్త ఆడిట్‌ను మాస్టర్‌కార్డ్ సమర్పించింది. ప్రాసెస్ చేసిన డేటాను అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్ విదేశాల్లో నిర్వహించడంపై ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంస్థ భారత్‌లో జారీ చేసే కార్డులపై నిషేధం విధించింది. జులై 14న ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేస్తూ, మాస్టర్‌కార్డ్ కొత్త కార్డుల జారీపై ఆంక్షలు విధించింది. జులై 22 నుంచి భారత్‌లో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా మాస్టర్‌కార్డ్‌పై సెంట్రల్ బ్యాంక్ నిషేధం విధించింది. భారత్‌లోనే పేమెంట్ డేటా స్టోరేజ్ నిర్వహించాలని ఆదేశించినప్పటికీ మాస్టర్‌కార్డు పాటించలేదు. నిబంధనలను పాటించడంలో విఫలం కావడం వల్ల రిజర్వు బ్యాంక్ ఈ ఆంక్షలు విధించగా, ఇకపై మాస్టర్‌కార్డ్ కొత్త క్రెడిట్, డెబిట్, ప్రిపెయిడ్ కార్డు కస్టమర్లను చేర్చుకోలేదు. అయితే ఈ ఆంక్షల వల్ల ప్రస్తుత మాస్టర్‌కార్డ్ కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్‌బిఐ వెల్లడించింది. అన్ని బ్యాంక్‌లు, బ్యాంక్ యేతర సంస్థలు ఈ నిబంధనలను పాటించాలని రిజర్వు బ్యాంక్ ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News