Home తాజా వార్తలు ఇంద్రజాల మాష్టి కళాకారులు

ఇంద్రజాల మాష్టి కళాకారులు

Masti artists

 

మాష్టి కళాకారులు బాగోతాలతోపాటు గారడీ విద్యలు కూడా ప్రదర్శించడం విశేషం. వీరిలో ఈ రెండు రకాలుగా ప్రతిభ కలిగిన వారే మేళంలో ఉంటారు. గ్రామంలోని మాదిగ వారి అభిరుచి, కళాకారుల ప్రతిభను బట్టి మొదట రెండు మూడు బాగోతాలు ఒప్పుకున్నప్పటికీ , వీరు నైపుణ్యంతో ఏడు ఎనిమిది బాగోతాలు కూడా ఆడటం జరుగుతుంది. ప్రదర్శన కులంవారు సూచించినట్టుగానే కళాకారులు రాత్రి గాని పగలు గాని బాగోతాలు ప్రదర్శిస్తారు. కళాకారులు ప్రదర్శించే కథల్లో శ్రీకృష్ణ శమంతకం, సతీ తులసి, కాంతామతి, గరుడాచలం, బాలనాగమ్మ మొదలైన ఆటలు ప్రసిద్ధం. ప్రదర్శనలో కళాకారులు బాగోతానికి సంబంధించి ఆడే కథాంశానికి చెందిన పాత్రల ఆభరణాలు, కిరీటాలు, డ్రెస్సులు ,కుళ్లలు, రంగులు తామే స్వయంగా అలంకరించుకుంటారు. అంతేకాకుండా స్త్రీల వేషాలను మగవారే ధరించి భాగోతాన్ని రక్తి కట్టిస్తారు. బాగోతంలో మంత్రి పాత్ర ప్రధానమైనది. రంగస్థలం మీద బాగో తానికి చెందిన మిగతా పాత్రలను పరిచయం చేయడానికి ఈ మంత్రి పాత్రనే బాగోతాన్ని ప్రేక్షకులకు అర్థ మయ్యేరీతిలో వారి సందేహాలను తీరుస్తూ హాస్యం, శోకం, భయానకం, బీభత్సం, కరణం వంటి అంశాలను అ ద్భుతంగా పాత్రల చేత పలికిస్తుంది. నాటకంలో అక్కడక్కడ పద్యాలతో పాటు వచనంతో కూడిన సంభాషణ ఆకట్టుకునేలా ఉంటుంది.

మాష్టి కళాకారులు గారడి విద్య లో సాహసోపేతమైన విద్యలను కూడా ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పిస్తారు. నేటి ఆధునిక మెజీషియన్స్ చేసే ఇంద్రజాల ప్రదర్శన లో అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేక వస్తువులతోనే చేస్తారు. ప్రేక్షకులు కూడా వీరికి ముందు భాగంలో మాత్రమే ఉంటారు.అంతే కాకుండా మెజీషియన్ కు ప్రేక్షకునికి మధ్య చాలా దూరం ఉండడమే కాక ఒకవేళ ప్రేక్షకుడు మెజీషియన్ చేసే విద్యను కని పెట్టాలనుకున్న వీలు లేకుండా ఉంటుంది. అయితే మాష్టి వారు మాత్రం ప్రేక్షకుల దగ్గరే తాము ప్రదర్శించే విద్యలకు కావలసిన వస్తువులను సేకరించి,తమ చుట్టూ ప్రేక్షకులు ఉన్నప్పటికీ వారి కంటికి చిక్కకుండా తాము ప్రదర్శించే అంశాన్ని అద్భుతంగా ప్రదర్శించటం వీరి నైపుణ్యం.

జానపద కళల్లో ఇంద్రజాల కళారూపాలు లేదా గారడీ విద్యల పట్ల జానపదులు ఎక్కువగా ఆదరణ ఆసక్తి చూపుతారు. ఈ కళల్ని ప్రదర్శించే కళాకారులకు అద్భుత శక్తులు ఉంటాయని, మంత్రతంత్రాలు వస్తాయనే నమ్మకం ప్రధానంగా ఉండటమే ఇందుకు కారణం కావచ్చు . అంతేకాకుండా కళాకారులు ప్రదర్శించే కనికట్టు విద్యలు లేదా ఇంద్రజాల విద్యలు నమ్మశక్యంకాని విధంగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఈ కళాకారులు కూడా అద్భుత శక్తులు మంత్ర తంత్రాలు ఉన్నాయనే భ్రమని జానపదులకు కల్పిస్తూనే తమ నైపుణ్యంతో ఎటువంటి మంత్రాలు యంత్రాలు లేవనే విషయాన్ని స్పష్టం చేస్తారు. ఇది ఆయా కళారూపాల కళాకారుల గొప్పతనంగానే చెప్పవచ్చు.

ఇంద్రజాల విద్యలు లేదా గారడీ విద్యలు ప్రదర్శించే కళారూపాల్లో సాధనా శూరులు, కాటి పాపలు, బీరన్నలు, మోడీ, విప్రవినోదులు, గారడి, కురవంజి, మాష్టి కళా రూపాలున్నాయి. కేవలం ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించి ప్రదర్శించే కళాకారులు సాధనా శూరులు, బీరన్నలు, విప్రవినోదులు, మాష్టి వారు.
మాష్టి కళారూపం కళాకారులు మాదిగ వారికి ఆశ్రితులై గారడీ విద్యలతో పాటుగా బాగోతాలు ప్రదర్శిస్తారు. మాదిగ వారి ఆశ్రిత కళారూపాల్లో ఇంకా చిందు, బైండ్ల, నులక చందయ్యలు, డక్కలి కూడా ఉన్నాయి. కానీ ఇందులో గారడి విద్యలు చేస్తూ భాగోతాలు ప్రదర్శించే కళారూపం మాష్టి కళారూపం మాత్రమే. వీరు జాంబవంతుని కి కొడుకులుగా ,మాదిగ వారికి అన్నదమ్ములుగా చెప్పుకుంటారు

మేళం తయారుచేసుకోవడం
మాష్టి కళాకారులకు కూడా మిగతా ఆశ్రిత కళారూపాలకు ఉన్నట్టుగానే వంశపారంపర్యంగా సంక్రమించిన కట్టడి గ్రామాలుంటాయి. ఆయా గ్రామాలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రదర్శన నిమిత్తం కళాకారులు వెళ్లి ప్రదర్శిస్తారు. ఈ రకంగా ప్రతి సంవత్సరం కళాకారులు కట్టడి గ్రామాలకు వెళ్ళేటప్పుడు దసరా లేదా దీపావళి ముందర మేళం తయారు చేసుకుంటారు. ఇందుకోసం ఒక మంచి రోజు చూసుకొని వేర్వేరు గ్రామాల్లో ఉన్న కళాకారులను ఒక చోటికి పిలిపించుకొని ప్రదర్శన నిమిత్తం వెళ్ళినప్పుడు వచ్చే ప్రతిఫలం పంపకాల గురించి, వెళ్లే గ్రామాల గురించి్, ప్రదర్శన ఆభరణాల గురించి, వాద్యాలు , డ్రెస్ లు వీటన్నిటి గురించి చర్చించుకుంటారు.దీన్నేమేళం తయారుచేసుకోవడం అంటారు. మేళంలో పది నుండి పదిహేను మంది కళాకారులుంటారు .

ఇదే రోజున తమకు మంచి జరగాలని వీరి కులదైవమైన ఎల్లమ్మ తల్లిని, తమ కళారూపానికి చెందిన వస్తువులను పూజించుకుంటారు. దీన్నే పెట్టె పూజ అని పిలుస్తారు. ఆ తర్వాత కట్టడి గ్రామాల మీదికి బయలుదేరుతారు. మొదట గ్రామంలోని మాదిగ పెద్దలను కలిసి ప్రదర్శనకు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ పెద్ద మనుషులు కూడా మిగతా కులం వారందరిని సంప్రదించి, ప్రదర్శన ఏర్పాటు చేస్తే దానికి పారితోషికం కళాకారులకు ఎంత ఇచ్చేది ఒప్పందం కుదుర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో గ్రామంలో ఆటలు ఆడించడానికి కులం వారు ఒప్పుకోకపోతే ఆ వూరి హక్కుదారుడైన కళాకారుడు మాత్రమే అక్కడ ఉండి ఆ గ్రామంలో త్యాగం మాత్రమే అడుక్కొని బయలుదేరుతాడు. మిగతా కళాకారులు వేరే గ్రామానికి వెళ్లడం జరుగుతుంది. కనీసం గ్రామంలో ప్రదర్శనకు కళాకారులు రెండు లేదా మూడు భాగోతాలు, ఒకరోజు గారడీ విద్యలు ప్రదర్శించేట్లు ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రదర్శించే రోజుల్లో కళాకారులకు మాదిగ వారే భోజనాలు వసతి ఏర్పాటు చేస్తారు.

Masti artists

 

బాగోతాల ప్రదర్శన
కళాకారులు బాగోతాలతోపాటు గారడీ విద్యలు కూడా ప్రదర్శించడం విశేషం. వీరిలో ఈ రెండు రకాలుగా ప్రతిభ కలిగిన వారే మేళంలో ఉంటారు. గ్రామంలోని మాదిగ వారి అభిరుచి, కళాకారుల ప్రతిభను బట్టి మొదట రెండు మూడు బాగోతాలు ఒప్పుకున్నప్పటికీ, వీరు నైపుణ్యంతో ఏడు ఎనిమిది బాగోతాలు కూడా ఆడటం జరుగుతుంది. ప్రదర్శన కులంవారు సూచించినట్టుగానే కళాకారులు రాత్రి గాని పగలు గాని బాగోతాలు ప్రదర్శిస్తారు. కళాకారులు ప్రదర్శించే కథల్లో శ్రీకృష్ణ శమంతకం, సతీ తులసి, కాంతామతి, గరుడాచల్‌ం, బాలనాగమ్మ మొదలైన ఆటలు ప్రసిద్ధం. ప్రదర్శనలో కళాకారులు బాగోతానికి సంబంధించి ఆడే కథాంశానికి చెందిన పాత్రల ఆభరణాలు, కిరీటాలు, డ్రెస్సులు, కుళ్లలు, రంగులు తామే స్వయంగా అలంకరించుకుంటారు.

అంతేకాకుండా స్త్రీల వేషాలను మగవారే ధరించి భాగోతాన్ని రక్తి కట్టిస్తారు. బాగోతంలో మంత్రి పాత్ర ప్రధానమైనది . రంగస్థలం మీద బాగోతానికి చెందిన మిగతా పాత్రలను పరిచయం చేయడానికి ఈ మంత్రి పాత్రనే బాగోతాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేరీతిలో వారి సందేహాలను తీరుస్తూ హాస్యం, శోకం, భయానకం, బీభత్సం, కరణం వంటి అంశాలను అద్భుతంగా పాత్రల చేత పలికిస్తుంది. నాటకంలో అక్కడక్కడ పద్యాలతో పాటు వచనంతో కూడిన సంభాషణ ఆకట్టుకునేలా ఉంటుంది.

గారడీ విద్యలు
మాష్టి కళాకారులు గారడి విద్య లో సాహసోపేతమైన విద్యలను కూడా ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పిస్తారు. నేటి ఆధునిక మెజీషియన్స్ చేసే ఇంద్రజాల ప్రదర్శన లో అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేక వస్తువులతోనే చేస్తారు. ప్రేక్షకులు కూడా వీరికి ముందు భాగంలో మాత్రమే ఉంటారు.అంతే కాకుండా మెజీషియన్ కు ప్రేక్షకునికి మధ్య చాలా దూరం ఉండడమే కాక ఒకవేళ ప్రేక్షకుడు మెజీషియన్ చేసే విద్యను కని పెట్టాలనుకున్న వీలు లేకుండా ఉంటుంది. అయితే మాష్టి వారు మాత్రం ప్రేక్షకుల దగ్గరే తాము ప్రదర్శించే విద్యలకు కావలసిన వస్తువులను సేకరించి,తమ చుట్టూ ప్రేక్షకులు ఉన్నప్పటికీ వారి కంటికి చిక్కకుండా తాము ప్రదర్శించే అంశాన్ని అద్భుతంగా ప్రదర్శించటం వీరి నైపుణ్యం.

ఈ కళాకారులు ప్రదర్శించే గారడీ విద్యలో బండ్లు గుంజడం, పొడి మన్నును నీటిలో కలిపి తిరిగి పొడి మన్నుగా తీయడం, ఒక గుంజకు కట్టేసిన వ్యక్తి వేరే గుంజలకు మారడం, కడాయిలో కాలుతున్న నూనెలో నుంచి చేతులతోనే అప్పాలు తీయడం ,పొట్ట మీద బండరాళ్లను పగలగొట్టించుకోవటం, పల్టీలు కొట్టడం మొదలైన విద్యలను ప్రేక్షకులు అబ్బుర పరిచేలా ప్రదర్శిస్తారు.ప్రేక్షకులు కూడా వీరు ఆడే భాగోతాల కంటే ఎక్కువ గారడీ విద్యల పట్లనే ఆసక్తిని కనబరుస్తారంటారు కళాకారులు.

బండ్లు గుంజడం
గ్రామంలో భాగోతాలు ఆడటం పూర్తికాగానే మరుసటి రోజున గారడీ విద్యలను ప్రదర్శిస్తారు. ఈ కళాకారులు ఇందుకోసం సమాంతరంగా ఉండే నేలను ఎంచుకుంటారు. గ్రామంలో సుమారుగా ఏడు నుండి ఇరవైఒక్క బండ్ల వరకు సేకరించి ఒక్కొక్కటిగా అన్ని బండ్లను కలుపుతూ అంటగడతారు. మొదట ఉన్న బండి ’కానికి ’రెండు వైపులా ఒక్కొక్క కళాకారుడు మెడల మీద పెట్టుకొని ఉండగా ,ఒక కళాకారుడు మాత్రం నొగకు తన తల వెంట్రుకలతో కట్టుకుంటాడు. ఆ బండ్లలో ప్రేక్షకులను ఎక్కించిన తర్వాత కళాకారుడు తన వెంట్రుకలతోనే బండ్లను గుంజుతాడు. ఈ రకంగా గుంజుతూ బండ్లను ఊరిబయట వదిలిపెట్టి వస్తారు. ఈ విద్యను కళాకారులు ప్రదర్శించి ప్రేక్షకులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు.

ఒక గుంజకు కట్టేసిన వ్యక్తి వేరే గుంజలకు మారడం: ఈ విద్యను ప్రదర్శించడానికి కళాకారులు ముందుగా నాలు గు గుంజలు పాతి ఆ గుంజలు కనిపించకుండా ఒక పరదా కడతారు. ప్రేక్షకులు చూస్తుండగానే ఒక గుంజకు కళాకారుణ్ణి కట్టేసి, ఆ తర్వాత బయట కళాకారులు పరదా లో ఉన్న కళాకారుణ్ణి ఏ గుంజకు మారమంటే ఆ గుంజకు మారుతూ కళాకారుడు ప్రేక్షకులకు కనువిందు చేస్తాడు. ఈ రకమైన విద్యను సాధనా శూరులు కూడా ప్రదర్శించడం విశేషం.
పొడి మన్నును నీటిలో కలిపి తిరిగి పొడి మన్నుగా తీయడం: కళాకారుడు ఒక బిందెలో నీళ్ళు తీసుకొని ్, ప్రేక్షకులకు తన చేతి పిడికిలిలో ఉన్న పొడి మన్నును చూపించి నీటిలో కలుపుతాడు. కొద్ది సమయం తర్వాత తన రెండు చేతులను ప్రేక్షకులకు చూపించి , నీటిలో చేయి పెట్టి పొడి మన్ను తీసి ప్రేక్షకులను విస్మయ పరుస్తాడు.ఈ రకమైన విద్యను సాధనా శూరులు కూడా ప్రదర్శిస్తారు .

కడాయిలో కాలుతున్న నూనెలో , చేతులతోనే అప్పాలు తీయడం: (గుడాలు దేవుడు) కళాకారులు ఈ విద్యను ప్రదర్శిస్తున్నప్పుడు చేతులకు ఎటువంటి పసర్లు గాని, నూనెలు గాని రాసుకోరు. ఈ విద్యకు ఉపయోగించే కడాయిని, పొ య్యిలో పెట్టడానికి కట్టెలు, నూనె కూడా పోషక కులం దగ్గర నుండి సేకరిస్తారు. వీటన్నింటినీ కళాకారులు ప్రత్యేకంగా తెచ్చుకున్న వస్తువులు కూడా కాదు. గ్రామంలోనే సేకరించిన వస్తువులతోనే ప్రదర్శిస్తారు. పొయ్యిలో మంట పెట్టి కాగుతున్న నూనెలో శెనగపిండి లేదా వరి పిండితో చేసిన అప్పాలు కడాయి లో వేస్తారు. ఆ తర్వాత అనుభవం ఉన్న కళాకారుడు తన ప్రతిభతో మంటను కూడా ఎంత ఎత్తుకు అంటే అంత ఎత్తుకు మూడు సార్లు లేపి, ఆ తర్వాత అప్పాలు కాలినాయని,కడాయి (మూకుడు) నూనెలో చెయ్యి పెట్టి బయటకు తీసి పరీక్షించి తింటాడు. తన చేతులకు కొంచెం కూడా కలగకపోవడం ప్రేక్షకులకు విస్మయం కలిగిస్తుంది ఈ విద్యను కళాకారుల్లో అనుభవం ఉన్న వ్యక్తి ప్రదర్శించి తమ కళారూపం గొప్పతనాన్ని చాటుతాడు.

పొట్ట మీద బండరాళ్లను పగుల గొట్టించుకోవడం
ఈ కళాకారులు సాహసోపేతమైన విద్యలనే ఎక్కువగా ప్రదర్శిస్తారు. ప్రదర్శనలో భాగంగా ఒక కళాకారున్ని పడుకోబెట్టి అతని పొట్ట మీద బండరాళ్ళనుంచి సుత్తె లేదా గన్నుతో ఆ రాళ్ళను ముక్కలు చేస్తారు. ఈ రకంగా కళాకారులు తమ శక్తిని నైపుణ్యాన్ని వినియోగించుకుని ప్రదర్శించి ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తారు . ఈ రకంగా ప్రదర్శించడం వీరికి గతం నుంచి సంక్రమించిందని అంటారు. ప్రదర్శన మధ్యమధ్యలో సమయం ఉంటే, ఈ సమయంలో కళాకారులు పల్టీలు కొడుతూ ప్రేక్షకులు తమ ప్రదర్శనకు ఆకర్షితులయ్యేలా చే స్తూ ఉంటారు. ప్రదర్శన ఆద్యంతం కళాకారులకు మరియు ప్రేక్షకులకు ఉత్తేజం కలిగించడానికి డప్పులు మోగిస్తూనే ఉంటారు.

ఈ కళాకారులు విద్యలు ప్రదర్శించేటప్పుడు తా ము సత్యవంతులమని, జాంబవంతుని బంటులమని చెప్తా రు . జాంబవంతుడు మాకు దైవమై మమ్మల్ని కాపాడతాడని పొగుడుతూ ఉంటారు. జాంబవంతుని బంటులము కాకపోతే మేము చేసే విద్యలు విఫలమవుతాయని హెచ్చరించు కుం టూనే, ఆ విద్యలు ఫలిస్తే, మేము జాంబవంతుని బంటులమని చెప్పుకుంటూ ప్రదర్శిస్తారు. వీరు ప్రదర్శనలో జాంబవంతుని మీద అమితమైన గౌరవాన్ని,భక్తిభావాన్ని చూపుతారు. ప్రదర్శన ప్రారంభంలో వీరి కులదైవమైన ఎల్లమ్మ తల్లి కి పూజ చేసే ప్రదర్శన ప్రారంభిస్తారు. అంతేకాకుండా ప్రదర్శనలో మాదిగ కుల పెద్దలతో పాటుగా వారికి సహాయం చేసిన కులం వారందరిని పొగడతారు.

నేటి స్థితి
మాష్టి కళాకారులు వేషం కడితే రాజులు, గారడీ చేస్తే అద్భుత సాహసవంతులు, కానీ ప్రదర్శన లేకుంటే మాత్రం రోజువారి కూలీలు. మాదిగ వారికి ఆశ్రితులుగా గత చరిత్ర నిర్మించిన పునాదుల మీద తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న కళాకారులు చాలావరకు అంతరించి పోగా చివరగా అక్కడక్కడ పది నుండి పదిహేను మంది కళాకారులు మాత్రమే మిగిలి ఉన్నారు . ఈ కళాకారులు సిద్దిపేట దగ్గరి కొండపాక మండలం మాటుపల్లి,గజ్వేల్ దగ్గరి చౌదర్పల్లి,మాచారం మొదలైన ప్రాంతాల్లో భాగోతాలు గార డీ విద్యలు చేసే కళాకారులు ఉన్నారు.

వేరే ప్రాంతాల్లో కూడా మాష్టి కులం వారు ఉన్నప్పటికీ వారంతా కర్ర పనిచేస్తూ జీవిస్తున్నారు. అయితే విద్య తెలిసిన కళాకారులు మాత్రమే ప్రతి సంవత్సరం మేళం తయారు చేసుకొని, అందరినీ కలుపుకొని ఒక బృందంగా ఏర్పడి వారి వారి కట్టడి గ్రామాలకు వెళ్తున్నారు.అయితే ప్రస్తుతం ఉన్న తరం వారే ఈ కళను పోషించుకుంటూ,వంశానుగతంగా సంక్రమించిన ఆస్తిగా, గౌరవంగా భావించి కళను పోషించుకుంటూ వస్తున్నారు. ఈ కళాకారుల సంతతికి ఈ కళ మీద ఆసక్తి లేదని వీరి మా టల్లో తెలుస్తున్నది. అంతేకాకుండా నేటి కాలంలో ఈ కళకు ఆదరణ లేదని ఈ కళ అంతరించి పోతుందని ఆవేదన చెందుతున్నారు.

ఈ కళాకారులు కూడా ఒక దశలో కళని త్యజించాలని అనుకున్నప్పటికీ తమకు వారసత్వంగా సంక్రమించినది కావడంతో ఆ గౌరవమే కళను పోషించేలా చేస్తుందంటున్నారు కళాకారులు. సిద్దిపేట,గజ్వేల్ కరీంనగర్ ప్రాంతంలో ఉన్న కళాకారులు మాత్రమే ఈ కళను నమ్ముకుని జీవిస్తున్నారు.ఈ కళనే నమ్ముకుని మనుగడ సాగిస్తున్న కళాకారులు ప్రభుత్వపరంగా అందించే కళాకారుల పెన్షన్ మరియు ప్రదర్శన అవకాశాలు విరివిగా కల్పిస్తే మా కళతో పాటు మేము ఆత్మ గౌరవంతో జీవిస్తామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

Masti artists perform juggling courses