Friday, March 29, 2024

టీ-సాట్ ఛానెళ్ల ద్వారా గణితం, ఇంగ్లీష్ నేర్చుకోండి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ktr

 

హైదరాబాద్: లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో లాక్‌డౌన్ విధించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీ-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటి వద్దే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చన్నారు. టీ-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ప్రసారాలు కేబుల్ నెట్‌వర్క్‌లోనూ ప్రసారం చేస్తాయన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలో కరోనా వైరస్ 334కు చేరుకోగా 11 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 33 మంది కోలుకున్నారు.

Maths, english learn on Tsat channel says KTR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News