Thursday, February 2, 2023

మయాంక్ డబుల్ ధమాకా

mayank-agarwalభారత్ 502/7 డిక్లేర్డ్, సౌతాఫ్రికా 39/3, కోహ్లి సేన పైచేయి, సఫారీతో తొలి టెస్టు
- Advertisement -

విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆతిథ్య టీమిండియా పైచేయి సాధించంది. గురువారం రెండో రోజు కూడా భారత్ ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 502 పరుగుల భారీ స్కోరు సాధించి డిక్లేర్డ్ చేసింది. యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (215) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (177) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాడు.

దీంతో భారత్ మెరుగైన స్కోరును సాధించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసి కష్టాల్లో చిక్కుకుంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (27), బవుమా (2) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు అందుకోవాలంటే సౌతాఫ్రికా మరో 463 పరుగులు చేయాలి. పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పక పోవచ్చు.

అదే జోరు..

ఓవర్‌నైట్ స్కోరు 202/0తో గురువారం రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు అండ గా నిలిచారు. ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించారు. ఒకవైపు సమన్వయంతో ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ముం దుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దూకుడుగా ఆడిన రోహిత్ స్కోరును పరిగెత్తించాడు. మ యాంక్ కూడా ధాటిగా ఆడు తూ తనవంతు పాత్ర పోషించాడు.

ఇటు రోహిత్, అటు మయాంక్ చెలరేగడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఇదే క్రమంలో మయాంక్ టెస్టుల్లో తన తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మరోవైపు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను ఆడిన రోహిత్ 244 బంతుల్లో ఆరు సిక్సర్లు, మరో 23 బౌండరీలతో 176 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 317 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లంచ్ విరామ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 324 పరుగులు చేసింది.

తీరు మారని పుజారా

ఇక, వన్‌డౌన్‌లో వచ్చిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా నిరాశ పరిచాడు. సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొవడంలో విఫలమయ్యాడు. వెస్టిండీస్ సిరీస్‌లో కూడా పుజారా భారీ స్కోర్లు సాధించలేక పోయాడు. ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే చేశాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఫిలాండర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించడం ఖాయమని భావించిన కోహ్లి 4 ఫోర్లతో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు వైస్ కెప్టెన్ అజింక్య రహానె కూడా భారీ స్కోరు సాధించలేక పోయాడు. 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

మయాంక్ పోరాటం

ఒకవైపు వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు మయాంక్ జోరును కొనసాగించాడు. సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లు, సిక్సర్లుగా మలచడంలో సఫలమయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మయాం క్ 371 బంతుల్లో 23 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 215 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాగా, మయాంక్ కెరీర్‌లో ఇది తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. వెస్టిండీస్ సిరీస్‌లో అంతగా రాణించని మయాంక్ సౌతాఫ్రికాపై మాత్రం భారీ స్కోరుతో ఆకట్టుకున్నాడు. రానున్న రోజుల్లో ఇలాంటి ప్రదర్శనే చేయాలని భావిస్తున్నాడు.

స్కోరుబోర్డు:
భారత్ మొదటి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి) డేన్ (బి) ఎల్గర్ 215, రోహిత్ శర్మ (స్టంప్డ్) డికాక్ (బి) మహారాజ్ 176, చటేశ్వర్ పుజారా (బి) ఫిలాండర్ 6, విరాట్ కోహ్లి (సి) (బి) ముత్తుస్వామి 20, అజింక్య రహానె (సి) బవుమా (బి) మహారాజ్ 15, రవీంద్ర జడేజా (నాటౌట్) 30, హనుమ విహారి (సి) ఎల్గర్ (బి) మహారాజ్ 10, వృద్ధిమాన్ సాహా (సి) ముత్తుస్వామి (బి) డేన్ పియెడ్ట్ 21, రవిచంద్రన్ అశ్విన్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం 136 ఓవర్లలో 502/7 డిక్లేర్డ్.
బౌలింగ్: ఫిలాండర్ 224681, కగిసో రబడా 247660, కేశవ్ మహారాజ్ 5561893, డేన్ పియెడ్ట్ 1911071,

ముత్తుస్వామి 151631, డీన్ ఎల్గర్ 1041.
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: డీన్ ఎల్గర్ (బ్యాటింగ్) 27, ఐడెన్ మార్‌క్రామ్ (బి) రవిచంద్రన్ అశ్విన్ 5, బ్రూయిన్ (సి) సాహా (బి) అశ్విన్ 4, డీన్ పియెడ్ట్ (బి) రవీంద్ర జడేజా 0, బవుమా (బ్యాటింగ్) 2, ఎక్స్‌ట్రాలు 1, మొత్తం 20 ఓవర్లలో 39/3.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 2080, మహ్మద్ షమి 2200, రవిచంద్రన్ అశ్విన్ 8492, రవీంద్ర జడేజా 81211.

mayank agarwal hits maiden double century

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles