Home తాజా వార్తలు ఆషాడ మాస బోనాల ఉత్సవాల్లో మేయర్ విజయలక్ష్మి

ఆషాడ మాస బోనాల ఉత్సవాల్లో మేయర్ విజయలక్ష్మి

Mayor Gadwal Vijayalaxmi At Ujjain Mahakal Bonalu

హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి పలువురు అమ్మవారులను దర్శించుకున్నారు. ముందుగా సికింద్రాబాద్ బోనాల పండుగ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మేయర్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం మేయర్ బంజారాహిల్స్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో జరిగిన అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి పాత బస్తీకి చేరుకున్న మేయర్ అక్కడ భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లాల్ దర్వాజ మహంకాళి బోనాల జాతర అమ్మవాఇర ఘటాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి అమ్మవారి ఘటానికి మంగళహారుతులు సమర్పించారు.