Home జిల్లాలు సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించడానికి చర్యలు

సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించడానికి చర్యలు

rajiv-sharamరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:సంపూర్ణ పారిశుద్దాన్ని సాధించేందుకు కలెక్టర్లు ఉత్సాహం గా విధులు నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రాజీవ్ శర్మ అభినందించారు. శుక్రవారం సచివాల యం నుంచి స్వచ్ఛ తెలంగాణ ద్వారా చేపడుతున్న కార్యక్ర మాలపై కలెక్టర్‌లతో విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో పరి శుభ్రత, పారిశుద్ధంపై అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని, కలెక్టర్‌లు తమ అభిప్రాయాలను ఒకరికొక రు పంచుకుని ముందుకు పోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమాల సలహదారుగా పనిచేస్తున్న అయ్యర్ మాట్లాడుతూ పారిశుధం పాటించకపోవడం వలన 5 సంవత్సరాల లోపు పిల్లలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం నాలుగు జిల్లాలో సంపూర్ణ పారిశుద్దం సాధిం చి ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడుతూ జిల్లాలో 668 గ్రామ పంచాయతీల్లో 3,13,129 గృహాలు ఉండగా వీటిలో 1,32,129 గృహాలకు మాత్రమే మరుగు దొడ్లు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఐదు గ్రామాల్లో సంపూర్ణ మరు గుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని, 16,216 మరు గుదొడ్ల నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. ఈ విడియో కాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులు పాల్గొన్నారు.