Home తాజా వార్తలు ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలి

ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలి

Medak MLA participates in fit india run

 

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మన తెలంగాణ/మెదక్ : మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే అంశాలతోపాటు ప్రతి ఒక్కరు దేశభక్తి కూడా పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆజాది కా అమ్రిత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నెహ్రు యువక కేంద్రం, జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన ఫిట్ ఇండియా రన్ 2.0 కార్యక్రమాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో యన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారతమాతాకు జై అంటూ నినాదిస్తూ 75 మీటర్ల జాతీయ పతాకం చేతబూని, 75 మంత్రి స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలను ప్లకార్డులను ప్రదర్శిస్తూ సాగిన రన్ పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ పరాయి పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని 75 వసంతాలు అవుతున్న సందర్భంగా ఆనాటి మహానుభావుల త్యాగాలను మనం చేసుకుంటూ ముందుతరాలకు దేశ సంస్కృతి, ఔన్న త్యం తెలుపుటకు కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమ్రిత్ మహోత్సవంలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిందని అన్నా రు. మన భారతదేశం అన్ని మతాల సామరస్యం, అన్ని రాష్ట్రాల కలయిక అని ప్రపంచానికి మార్గదర్శకమని అన్నా రు. దేశం మనకేమిచ్చింది అనే దానికంటే మనం దేశానికి ఏమి ఇవ్వబోతున్నామనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకుని దేశ, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ముందుకు వెళ్లాలన్నా రు. మన మట్టిలో, మన సాంప్రదాయంలో, ఔన్నత్యంలో శక్తి ఉంది కాబట్టే దేశం నుంచి కరోనాను తరిమికొట్టామన్నారు. భారతదేశ ఆచార సంప్రాదాయాలను అనుకరిస్తూ వాటిని కాపాడుతూ ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని సూచించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ మన శరీరం, మనస్సు స్వాధీనంలో ఉండాలన్నా, ఆరోగ్యం గా ఫిట్‌గా ఉండాలన్నా తప్పనిసరిగా ప్రతిరోజు ఆరగంట వ్యాయమానికి కేటాయిస్తూ నడవడం, రన్నింగ్, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని అన్నారు. అక్టోబర్ 2 వరకు కొనసాగే ఫ్రీడమ్ రన్‌లో భాగంగా జిల్లాలోని 75 గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా జిల్లాలో మరుగున పడిన చరిత్రకెక్కని స్వాతంత్య్ర సమరయోధులు, సంఘటన వివరాలు ఏమైనా మీ దృష్టికి వస్తే జిల్లా యంత్రాంగానికి తెలుపాలని ఆమె కోరారు. అంతకుముందు కళాకారుల బృందం ప్రదర్శించిన దేశభక్తి గీతాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో సహాయ ట్రైనీ కలెక్టర్ ఆశ్విని తానాజీ వాఖడే, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, నెహ్రు యువక కేంద్ర జిల్లా యువజన అధికారి బెన్సీ, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, జిల్లా విద్యా శాఖాధికారి రమేష్, డీపీఓ తరుణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్‌నాయక్, బిసి అభివృద్ధి అధికారి జగదీశ్, పంచాయతీరాజ్ డీఈఈ, మున్సిపల్ కమీషనర్ శ్రీహరి, డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు చంద్రశేఖర్, వ్యాయమ ఉపాధ్యాయులు, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నెహ్రు యువజన సంఘాల కోఆర్డినేటర్లు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

MLA padma devender reddy participates in fit india run