Thursday, April 25, 2024

మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

medaram jatara 2021 dates in telugu

ములుగు :  మేడారం జాతరకు మంగళవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. సమ్మక్క, సారమలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వన దేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు మినీ మేడారం జాతరకు రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకునేందుకు గద్దెల వద్దకు చేరుకుంటారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మినీ మేడారం జాతరలో ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మేడారం జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మేడారంలో ప్రధాన కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గద్దెల ప్రాంగణంలో, జంపన్న వాగు పరిసరాలలో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు దేవాలయ ఈవో రాంజేద్రం తెలిపారు.

medaram jatara 2021 dates in telugu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News