Home రాష్ట్ర వార్తలు జనహిత వైద్యం

జనహిత వైద్యం

పేదవారికి వైద్యాన్ని చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కెటిఆర్ 

సంగారెడ్డి జిల్లాలో మెడికల్ డివైజెస్ పార్కు ప్రారంభం 

KTRరామచంద్రాపురం : ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడి ప్రజలకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక మార్పులు కూడా అవ సరమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖమంత్రి కెటి రామా రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో శనివారం వైద్య పరికరాల తయారీ పారిశ్రామి కవాడ ను మంత్రి హరీశ్ రావుతో కలిసి కెటిఆర్ ప్రారంభిం చారు. ముందుగా పైలాన్‌ను ఆవిష్క రించి దేశ విదేశాల నుంచి హాజరైన వివిధ పరిశ్రమల ప్రతినిధులకు లాండ్ అలా ట్‌మెంట్ పత్రా లను మంత్రులు అందజేశారు. అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ 250 ఎకరాల్లో ఈ వైద్య పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని దీని ద్వారా వేలాది మంది కార్మికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకుతాయన్నారు. పేదవాడికి వైద్యాన్ని దగ్గర చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద పారిశ్రామి కవాడను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చిందని, దీని ద్వారా స్థానికుల కే సింహభాగపు ఉద్యోగాలను కేటాయించనున్నా మన్నారు. ఉత్పిత్తితో పాటు ఇన్నోవేషన్, ఇంక్యూ బేషన్‌లకు చోటు కల్పిస్తూ వైద్య పరికాల ఉత్పత్తితోపాటు చైనా, కొరియా దేశాల మెడికల్ పార్కులతో ప్రభుత్వం ఎంఒయు చేసుకుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రాంతం కరువు ప్రాంతం కాదని సస్య శ్యామలమైన అభివృద్ధి చెందిన రాష్ట్రమని ఈ సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో మెడికల్, ఫార్మా సూటికల్ రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఈ వైద్య పరికరాల పారిశ్రామికవాడ ద్వారా రాష్ట్రం మెడికల్ టూరిజంలోకి అడుగు పెట్టిందన్నారు. పారిశ్రామిక వేత్తల సహకారంతో చదువుకున్న వారందరి కీ శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉంద ని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారని కెటిఆర్ అన్నారు. మొదటి రోజు 50 ఎకరాల్లో 14 పరిశ్రమలకు లాండ్ అలాట్‌మెంట్ చేశామని పేర్కొన్నారు. అనం తరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఐటి, పారి శ్రామిక రంగాల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని దీనికి ప్రధానంగా సిఎం కెసిఆర్, కెటిఆర్‌ల ప్రత్యేక కృషి కారణమన్నారు. ఐటి, ఇండస్ట్రియల్ పాలసీలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ మార్పులకు అనుగు ణంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, తెలం గాణ ప్రభుత్వ హయంలో పరిశ్రమలకు నిరంత రాయ విద్యుత్‌ను అం దించామన్నారు. ఈ కార్యక్ర మంలో టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లు, ఎండి.వెంకటనర్సింహా రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిప ల్‌సెక్రటరి జయేష్ రంజన్, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి, ఎంఎల్‌సి పాతూరిసు ధాకర్ రెడ్డి, భూపాల్‌రెడ్డి, కలెక్ట ర్ మాణిక్యరాజ్, జెసి వెంకటే శ్వర్లు, స్థానిక ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.