Thursday, April 25, 2024

మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి 9.10 గంటలకు కన్నుమూశారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజిఎంలో ఆత్మహత్యకు యత్నించిన పిజి వైద్య విద్యార్థినికి నిమ్స్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వి ద్యార్థి ప్రీతి తుదిశ్వాస విడిచినట్లు నిమ్స్ వై ద్యులు ప్రకటించారు. కాకతీయ వైద్య కళాశాలలో పిజి అనస్థీషియా మొదటి సంవత్సరం చ దువుతున్న విద్యార్థినిని సీనియర్ పిజి విద్యార్థి సైఫ్ వేధింపులు తాళలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్ చేసుకుని బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి తొలుత వరంగల్ ఎంజిఎంలో చికిత్స అందించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.

ప్రీతి ని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ కుమార్తె ఇకలేరని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తో టి స్నేహితురాలు చనిపోవడంతో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు శోకసంద్రంలో మునిగిపోయారు. జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి ప్రీతి స్వగ్రామం. శిక్షణలో భాగంగా ఎంజిఎంలో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి నరేందర్ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఎఎస్‌ఐగా పనిచేస్తున్నారు. నగరంలోని బోడుప్పల్ వెస్ట్ బాలాజీ నగర్‌లో నివాసం ఉం టున్నారు. విధుల్లో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లి వస్తున్నారు. రవీంద్ర మూడో కుమార్తె ప్రీతి.

విషపు ఇంజక్షన్ తీసుకుని బలవన్మరణానికి యత్నం

సీనియర్ మెడికో సైఫ్ వేధింపులతో విసిగిపోయిన ప్రీతి తనకు తానుగా విషపు ఇంజక్షన్ తీసుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు హుటాహుటిన వరంగల్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎం తరలించగా అంతకంతకూ ప్రీతి ఆరోగ్యం విషమించింది. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. అయితే.. హానికర ఇంజక్షన్ తీసుకోవడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్‌పై ప్రభావం ఎక్కువగా పడుతుందని డాక్టర్లు చెప్పారు. శ్వాస తీసుకోవడంలోనూ ప్రీతి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షించింది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వైద్యులు అన్ని ప్రయత్నాలూ చేశారు. అయితే.. ఐదురోజులుగా ప్రీతిని కాపాడాలని ప్రత్యేక బృందం శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియోను ప్రకటించింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఎవరూ పూడ్చలేని దుఖంలో ప్రీతి కుటుంబం ఉందని అన్నారు. ప్రీతి మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు. ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతున్నదని, ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా… చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి దేవుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News