Friday, April 19, 2024

వైద్య విద్య కోసం వెళ్లి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన పూజితా రెడ్డి అనే వైద్య విద్యార్థిని ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి, అక్కడే పది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందింది. సోమవారం ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన మల్కాపూర్ (ఏ)కు తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్ గ్రామ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డికి కూతురు పూజిత రెడ్డితోపాటు మరో అరుణ్ రెడ్డి, భరత్ రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్ రెడ్డి పెద్ద కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. కూతురు పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో బీడీఎస్‌ పూర్తి చేసింది. అనంతరం పీజీ చదివేందుకు ఈ ఏడాది జనవరి 26న కెనడాకు వెళ్ళింది.

మొదట అక్కడ తన సోదరుడి ఇంట్లో వారం రోజులు ఉంది. ఆ తర్వాత యూనివర్సిటీలోని హాస్టల్లో తన స్నేహితులలో పాటు ఉంటోంది. ఈ క్రమంలో పది రోజుల క్రితం హాస్టల్ గదిలోనే గుండెపోటుతో పూజిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన స్నేహితులు, సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూజిత రెడ్డి మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని సోదరుడు ఇండియాలోని తమ స్వగ్రామానికి తీసుకువచ్చి, అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న గుండె పోటు మరణాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News