Tuesday, April 23, 2024

నియమించిన సౌకర్యాల్లోనే ఒమిక్రాన్ బాధితులకు వైద్యచికిత్స

- Advertisement -
- Advertisement -

Medical treatment for omicron victims within facilities

రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియమించిన కొవిడ్ సౌకర్యాల్లోనే ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాల్లోనే ఒమిక్రాన్ బాధితులకు వైద్యచికిత్సలు అందించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రితశాఖ బుధవారం లేఖలు రాసింది. ఈ సందర్భంగా ఇతర రోగుల నుంచి ఎలాంటి సంక్రమణ లేకుండా ఉండేలా హెల్త్‌కేర్ వర్కర్లు తగిన జాగ్రత్తలు తీసుకొంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలతో లేఖలు రాశారు.

అంతర్జాతీయ ప్రయాణికులు, వారి సన్నిహితులు, హాట్‌స్పాట్‌ల నుంచి వచ్చే నమూనాలను నిబంధనల ప్రకారం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపాలని ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు జరుగుతుండాలని సూచించారు. అలాంటి కేసుల సన్నిహితులను కనుగొనడం చాలా కష్టమని, ఆయా కేసుల వారిని ఎలాంటి జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఈసంజీవని టెలిమెడిసిన్ వేదికను , కాల్‌సెంటర్లను వినియోగించుకోవాలని, ప్రత్యేక బృందాలు ఇళ్లకు వెళ్లి ఇంటివద్దనే ఐసొలేషన్‌లో ఉన్నవారిని పర్యవేక్షించాలని లేఖలో సూచించారు. కొవిడ్ ప్రవర్తన, వ్యాప్తి, లక్షణాలపై సామాజికంగా అవగాహన కల్పించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News