Thursday, April 25, 2024

ఇంగువలో ఔషధగుణాలెన్నో..

- Advertisement -
- Advertisement -

 Ingua

 

ఒక్కొక్కరు ఒక్కో రకమైన పద్ధతిలో వంట చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోరకమైన రుచిని ఇష్టపడతారు. ఏ వంట చేసినా దాంట్లో చిటికెడు ఇంగువ వేస్తే చాలు ఆ రుచే వేరు. పులిహోరలో వేస్తే ఆహా! అనాల్సిందే.. ఘాటువాసనతో ఉండే ఇంగువలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే ఇంగువతో ఆరోగ్యం మాత్రమే కాదు
అందం కూడా పెరుగుతుందంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం!

* ఇంగువ యాంటీడోట్‌గా పనిచేస్తుంది. అల్లం, ఇంగువ పేస్ట్ మిశ్రమాన్ని కీటకాలు కుట్టడం వల్ల ఏర్పడిన దద్దుర్ల మీద రాస్తే అవి మాయమవుతాయి.
* నెలసరి సమయంలో ఒక కప్పు మజ్జిగలో కొద్దిగా ఇంగువ, మెంతుల పొడి, చిటికెడు ఉప్పు కలిపి తాగితే పొత్తికడుపులో నొప్పి మాయం అవుతుంది. ఇంగువలోని యాంటీ సెప్టిక్ గుణాలు ఉదర సంబంధ సమస్యలైన కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గిస్తాయి. రోజూ కొద్దిగా ఇంగువను పప్పు లేదా గ్రేవీలో వేసుకుంటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. గ్లాసెడు నీళ్లలో చిటికెడు ఇంగువ పొడి కలిపి తాగినా ఫలితం ఉంటుంది.

* వేడి నీళ్లలో ఇంగువ వేసుకొని రోజులో రెండు మూడు సార్లు తాగితే తలనొప్పి తగ్గిపోతుంది.
* దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలను పోగొట్టి ముఖాన్ని అందంగా మార్చుతాయి. ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్, ఇంగువ మిశ్రమం మొటిమల్ని తగ్గిస్తుంది.
* యోగర్ట్, బాదం నూనె, ఇంగువ పేస్ట్ తలకు రుద్దుకొని ఆరిన తరువాత వేడి నీళ్లతో శుభ్రం చేసుకుంటే కురులు తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

* దీనిలోని యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆస్తమా, బ్రాంకైటిస్, పొడి దగ్గు వంటి శ్వాసపరమైన ఇబ్బందులను తొలగిస్తాయి. ఇంగువలో అల్లంపొడి, తేనె కలిపి తాగినా ఉపశమనం లభిస్తుంది.
* రక్తం చిక్కదనాన్ని పెంచడం, రక్తపీడనాన్ని తగ్గించడంలో ఇంగువ తోడ్పడుతుంది. దీనిలోని కౌమరిన్ రక్త ప్రవాహన్ని మెరుగుపరచడంతో పాటు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

Medicinal characteristics in Ingua
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News