Home జాతీయ వార్తలు గ్రామాల్లో వైద్యానికి పెద్దపీట

గ్రామాల్లో వైద్యానికి పెద్దపీట

వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులు పెరగాలి: డబ్లుహెచ్‌ఒ సూచన

WHOకోల్‌కతా :  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకులు చెప్పిన మాటనే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్‌ఒ) చెబుతోంది. భార త్‌లో ముఖ్యంగా గ్రామప్రాంతాల్లో వైద్యపరమైన మౌలికసదుపాయాల కల్పనకు పెద్దపీట వేయా ల్సిన అవసరం ఉందని సంస్థ భారత ప్రతినిధి డాక్టర్ హెంక్ బెక్‌డమ్ తెలిపారు. ఆదివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ ప్రజలు ఆరోగ్యవంతులైతేనే దేశం పురోగమి స్తుందని పేర్కొన్నారు. అందుకే వైద్యారోగ్య సేవ ల్లో నాణ్యత, ప్రమాణాలు మెరుగుపడాలని ఆయన సూచించారు. వైద్యరంగంలో పెట్టుబడు లు పెట్టడమంటే దేశప్రగతికి పెట్టుబడులు పెట్ట డమేనని ఆయన అన్నారు. అందరికీ వైద్యం అందేలా చూడాలన్నారు. ఇటీవలి కాలంలో వైద్యరంగంలో భారత్ మంచి ప్రగతి సాధించిం దని ఆయన చెప్పారు. అయినప్పటికీ దేశజనా భాలో 60మిలియన్ల మంది వైద్యఖర్చులు చెల్లిం చలేక పేదలుగా మారుతున్నారని ఆయన తెలి పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది సరైన సమయంలో వైద్యం చేయించుకోలేకపోతున్నా రని ఆయన వివరించారు. అందుకే వైద్యసేవలు అందించడమే ప్రధాన కర్తవ్యంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ కొన్ని చర్యలు ప్రతిపాదించిందని ఆయన తెలిపారు. కొత్తకొత్త వ్యాధులను ముం దుగానే గుర్తించడం, వాటికి సరైన వైద్యం సకా లంలో అందించడం, ఆర్థిక పరిస్థితి కారణంగా ఎవరూ వైద్యం చేయించుకోలేని దుస్థితిని తొల గించడం వంటివి ఆ ప్రణాళికలో ఉన్నాయని ఆయన చెప్పారు.హెచ్‌ఐవి, మలేరియా, టిబి వంటి వ్యాధులను భారత్ గణనీయంగా నియం త్రించగలిగిందని ఆయన కొనియాడారు. ప్రస వ, శిశుమరణాలను కూడా తగ్గించగలిగింద న్నారు. వైద్యఖర్చులు చెల్లించడానికి ఆస్తులు విక్రయించి బీదలుగా మారిపోయే పరిస్థితిని నివారించడమే భారత్‌కు ప్రధాన సవాల్ అని ఆయన అన్నారు. ఎబోలా, హెచ్ వన్, ఎన్‌వన్ వంటి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాల న్నారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల ఆధారంగా భారత్‌లో కొత్తకొత్త వ్యాధులు వస్తు న్నాయని,ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా రని వాటిని పూర్తిగా నియంత్రించాల్సి ఉంద న్నా రు. డచ్‌కు చెందిన డాక్టర్ బెక్‌డమ్ గతంలో ఈ జిప్టులో ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రతినిధిగా పని చేశారు.అక్కడ ఎవియన్ ఫ్లూ, పోలియో వ్యాధు లను నియంత్రించడంలో పూర్తి విజయం సాధించారు.