Tuesday, April 23, 2024

బ్లాక్ ఫంగస్ తో తహసీల్దార్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండడంతో భారత్ దేశంలో ప్రధాన ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. దీనికి తోడు బ్లాస్ ఫంగస్ తో కరోనా రోగులు విలవిల లాడిపోతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ తో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి తహసీల్దార్ రాజేశ్వర్ ఫంగస్ తో చనిపోయాడు. నెల రోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి కోరుకున్నాడు. ఇటీవల అతడికి బ్లాక్ ఫంగస్ సోకడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. జిగిత్యాలలో ఇప్పటికి బ్లాక్ ఫంగస్ తో ఇద్దరు మృతి చెందారు. కొండగట్టుకు చెందిన వ్యక్తికి ఫంగస్ సోకడంతోనే మరణించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News