Tuesday, March 19, 2024

13న మెడ్‌ప్లస్ ఐపిఒ ఆఫర్

- Advertisement -
- Advertisement -

MedPlus IPO to open on 13th December

న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద రిటైలర్ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఈ నెల 13న ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)ను ప్రారంభించనుంది. ధర శ్రేణి రూ.780 నుంచి రూ.796 మధ్య ఉంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,398 కోట్లు సమీకరించాలని లక్షంగా చేసుకుంది. దీనిలో రూ.600 కోట్లు ఈక్విటీ షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 798 కోట్లు జారీ చేయనున్నారు. ఈ ఇష్యూ ఈనెల 15న ముగియనుంది. డిసెంబర్ 10న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ ప్రారంభిస్తారు. పెట్టుబడిదారులు ఈక్విటీ షేర్ల కోసం కనీసం 18 ఈక్విటీ షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్‌పై కనిష్టంగా రూ.14,328, గరిష్టంగా 13 లాట్‌లపై రూ.1,86,264 ఇన్వెస్ట్ చేయవచ్చు. 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (క్యూఐబిలు), 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 15 శాతం సంస్థాగత యేతర ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేస్తారు. ఈనెల 20న షేర్ల కేటాయింపు, 23న లిస్టింగ్ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News