Home వార్తలు మీకు మీరే…. మాకు మేమే!

మీకు మీరే…. మాకు మేమే!

Meeku-Meere‘నాన్నకు ప్రేమతో’ చిత్ర రచయిత హుస్సేన్ షా కిరణ్ దర్శకుడిగా మారి ‘మీకు మీరే మాకు మేమే’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో తరుణ్ శెట్టి, అవంతిక మిశ్రాలు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. కిరీటి దామరాజు, జెన్ని, భరణ్‌లు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. శ్రవణ్ అందించిన ఆడియోను అతి త్వరలో విడుదల చేసి అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ “తెలుగు సినిమా ఆల్‌టైమ్ క్లాసిక్ మూవీ ‘మిస్సమ్మ’ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్రంలోని ఓ సీన్‌కు ఇన్‌స్పైర్ అయి ఈ చిత్రాన్ని చేశాను. ‘మిస్సమ్మ’ చిత్రం బిట్ సాంగ్‌లోని పదాన్ని తీసుకొని ‘మీకు మీరే మాకు మేమే’ అని టైటిల్ పెట్టాం.  చక్కటి ప్రేమ కథ ఇది”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సూర్య వినయ్, ఎడిటర్‌ః మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్‌ః అభిషేక్, మనీషా సత్యవోలు, రాం.