Home తాజా వార్తలు ఆహ్వానిస్తే చర్చలకు సిద్ధం : అశ్వత్థామ

ఆహ్వానిస్తే చర్చలకు సిద్ధం : అశ్వత్థామ

RTC-Strike

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల డిమాండ్‌ల పై చర్చలకు ఆహ్వానిస్తే, తాము సిద్ధంగా ఉన్నామని జెఎసి కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆర్‌టిసి సంస్థను ప్రభుత్వంలో విలీనంతో పాటు 25 డిమాండ్‌ల పరిష్కారానికై 10 రోజులుగా నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి కార్మికుల డిమాండ్‌ల పరిష్కారాని కై 10 రోజుల పాటు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె విషయాలను కూలంకషంగా వివరించామన్నారు. ఈ సందర్భంగా మీడియా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సీనియర్ పార్లమెంట్ సభ్యులు, టిఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే.కేశవ్‌రావు లేఖ పై స్పందించారు. కార్మికుల డిమాండ్‌ల పరిష్కారాని కేశవ్‌రావు లేఖ మంచి పరిమాణంగా పేర్కొన్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానిస్తే ,తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కార్మికుల డిమాండ్‌లను రాష్ట్ర గవర్నర్ తమిళి సైకు సమగ్రంగా వివరించారు.

కార్మికుల డిమాండ్‌ల పై సానూకులంగా స్పందించారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిఎం కెసిఆర్‌ను కలువడాన్ని తాము తప్పుపట్టడంలేదన్నారు. ఆర్‌టిసి కార్మికుల డిమాండ్‌ల సాధనకై నిర్వహిస్తున్న నివరవధిక సమ్మె విషయాలను అన్ని సంఘాలకు చెందిన ప్రతినిధులను కలిశామని తెలిపారు. ఉద్యోగ ఐకాస నేతలను కలిసేందుకు గడువు కోరాము, ఐతే ఖమ్మం జిల్లాలో డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య సంఘటన మూలంగా ఐకాస ప్రతినిధుల భేటీ వాయిదా వేశామన్నారు. త్వరలో ఉద్యోగ సంఘాల ఐకాస ప్రతినిధులను కలుస్తామని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పుట్టిన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టిఎంయూ)కు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. కార్మికుల డిమాండ్‌ల పరిష్కారానికై తాము సమ్మె చేస్తున్నామని మరో స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల పై కార్మికులు సహనం కొల్పోవద్దుని జెఎసి కో కన్వీనర్ రాజిరెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర మంత్రులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మూలంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ తమిళి సై కార్మిక డిమాండ్‌ల పై సానూకూలంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే, మేము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. జెఎసి మరో కో కన్వీనర్ విఎస్. రావు మాట్లాడుతూ కేశవ్‌రావు లేఖ పై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జెఎసి ప్రతినిధులు పాల్గొన్నారు.

Meeting On RTC Workers Demand