Tuesday, February 7, 2023

‘మెగా చిరంజీవితం 150’ పుస్తకావిష్కరణ

- Advertisement -

Megaమెగాస్టార్ చిరంజీవి 150 చిత్రాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించిన పుస్తకం ‘మెగా చిరంజీవితం 150’ సినీ ప్రస్థానం శనివారం విడుదలైంది. రామ్‌చరణ్ ఈ పుస్తకాన్ని విడుదల చేసి దర్శకుడు వి.వి.వినాయక్‌కు అందించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ “నలభై ఏళ్లకు పైగా జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న పసుపులేటి రామారావు అనుభవమంత వయసులేనివాడిని నేను. ఈ పుస్తకంలో నేను కూడా చూడని నా ఫొటోలను రామారావు సేకరించారు. ఈ పుస్తకం మా లైబ్రరీలో నెంబర్ వన్ బుక్ అవుతుంది”అని అన్నారు. పసుపులేటి రామారావు మాట్లాడుతూ “చాలా ఆలోచించి ఈ పుస్తకానికి ‘మెగా చిరంజీవితం 150’ అని పేరు పెట్టాను. ఈ పుస్తకం రాయడానికి అల్లు అరవింద్ నైతికంగా ఎంతో మద్ధతునిచ్చారు. ఈ పుస్తకం కోసం చిరంజీవి ఓ స్పెషల్ ఇంటర్వూ ఇచ్చారు. సినిమాల్లో చిరంజీవి పడ్డ కష్టాన్ని నేను దగ్గరి నుండి చూశాను. ఈరోజు రామ్‌చరణ్ చేతుల మీదుగా ఈ పుస్తకం రిలీజ్ కావడం ఎంతో ఆనందంగా ఉంది”అని చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ “చిరంజీవి నట ప్రస్థానానికి సంబంధించి అన్ని కోణాలను పసుపులేటి రామారావు ఈ పుస్తకంలో పొందుపరిచారు. 150 సినిమాలు చేసిన చిరంజీవిపై పుస్తకం రాయడం సంతోషంగా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.కళ్యాణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles