Saturday, April 20, 2024

‘కరోనాను తరిమేస్తాం..’ మెగా ఫ్యామిలీ సందేశం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా మహమ్మారిపై దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది. కరోనా వైరస్ పై పజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇండియా టాప్ స్టార యాక్టర్స్ అంతా కలిసి కరోనాపై షాట్ ఫిలీమ్ కూడా తీశారు. దీంతోపాటు పలు పాటలు, పేరడీలు, ప్రత్యేక వీడియోల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పలు వీడియోలు, సందేశాలతో తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ‘స్టే ఎట్ హోం..స్టే ఎట్ సేఫ్’ అనే నినాదాన్ని విభిన్న రీతిలో చెబుతూ ప్రజలను చైతన్యం పరిచేందుకు ప్రయతిస్తున్నారు. మెగా హీరోలు చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అరవింద్, అల్లు శిరీష్, ఉపాసన, సుస్మిత, శ్రిజ, నిహారిక ఇలా అందరూ.. ‘ఇంట్లోనే ఉంటాం.. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమను పంచుదాం. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం. భారీతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం. స్టే హోమ్.. స్టే సేఫ్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని సందేశమిస్తున్న ఫోటోను చిరు తన ట్వీట్టర్ లో షేర్ చేశారు. దీంతో మెగా ఫ్యామిలీ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో షూట్ కోసం అందరూ తమ తమ ఇళ్లనుంచే ఫ్లకార్డును పట్టికొని కనిపించారు. కాగా, కరోనాను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి తమ వంతు సహాయంగా మెగా ఫ్యామిలీ హీరోలు భారీగా విరాళాలు ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందజేశారు. ఇప్పుడు కరోనాపై ప్రజలను చైతన్యం పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మెగా ఫ్యామిలీని మెచ్చుకోవాల్సిందే.

Mega Family Gives Awareness to people on Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News