Home తాజా వార్తలు నెట్‌లో హల్ చల్ చేస్తున్న మెగా ఫ్యామిలీ

నెట్‌లో హల్ చల్ చేస్తున్న మెగా ఫ్యామిలీ

chiru-family-photo-in-photoటాలీవుడ్ అభిమానుల్లో ప్రస్థుతం మెగా ఫ్యామిలీకు సంబంధించిన వార్తలు నెట్లొ హల్ చల్ చెస్తున్నాయి. దీంతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు చిరు, పవన్, రాంచరణ్, బన్నీ సినిమాలకు సంబంధించిన న్యూస్ అభిమానుల్లో జోష్‌ని పెంచుతుంటే, మరో వైపు మెగాస్టార్ ఇంట పెళ్లి సంబరాలు మొదలు అయ్యాయనే వార్త మెగా అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. చిరు  చిన్న కూతురు శ్రీజకు ఇటీవల చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీజకు చెందిన కొన్ని ఫోటోలను నెట్‌లో చక్కర్లు కొట్టడం వారి అనుమానాలను మరింత బలోపేతం చేసినట్టు తెలుస్తోంది. ఫోటోలలో శ్రీజ ఎంతో నిండుగా కనిపిస్తుండగా, పలువురు ఆమెకు పెళ్లికళ వచ్చేసిందంటున్నారు. మరి దీనిపై మెగా క్యాంపెయిన్ ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.