Home తాజా వార్తలు వెంకీ కుడుముల దర్శకత్వంలో వరుణ్ తేజ్

వెంకీ కుడుముల దర్శకత్వంలో వరుణ్ తేజ్

Mega Hero Varun Tej Act In Venky Kudumala Directionహైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగాా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. వెంకీ కుడుముల ’ఛలో‘, భీష్మ సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దసరా సమయంలో ప్రారంభమయ్యే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా నటి రష్మిక మందన్న నటించనుందని సమాచారం. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ తో కలిసి ’ఎఫ్3‘, బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ’గని‘ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత వెంకీ కుడుముల సినిమాను పట్టాలెక్కించే పనిలో వరుణ్ తేజ్ ఉన్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెంకీ కుడుముల త్వరలోనే వెల్లడించనున్నారని తెలిసింది.