Friday, April 26, 2024

రేపు నిమ్స్‌మేలో మెగా జాబ్‌మేళా

- Advertisement -
- Advertisement -

Mega job Mela in NIMSME tomorrow

హైదరాబాద్: జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (నిమ్స్‌మే) సంస్థ, ప్రిజం మల్టీమీడియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిజం సంస్థ ఎండి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యూసుఫ్‌గూడలోని నిమ్స్‌మే ప్రాంగణంలో జరిగే ఈ జాబ్‌మేళాలో 35కు పైగా ప్రైవేట్ సంస్థ పాల్గొంటాయని తెలిపారు. ప్రిజం, టిటి హబ్, మ్యాజిక్‌బస్ సౌజన్యంతో ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటి, బ్యాంకింగ్, ఫార్మా,హెల్త్‌కేర్ మార్కెటింగ్ తదితర ఉద్యోగాల్లోసంస్థల్లో పేర్కొన్న ఉద్యోగాల్లో విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలను అనుసరించి అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మేళాకు నిరుద్యోగ యువత తమ విద్యార్హత పత్రాలతో పాటు బయోడేటా, మూడు పాస్‌పోర్టుసైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 040 23633217/260, 72079 19709, 9121768411లో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News