Home తాజా వార్తలు బిగ్‌బాస్ ఈజ్ బ్యాక్..!

బిగ్‌బాస్ ఈజ్ బ్యాక్..!

mega-star-chiranjeeviమెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా, ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన మూవీ బ్రూస్‌లీ. ఈ చిత్రంలో మెగాస్టార్ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఒక ముఖ్యమైన పాత్రలో చిరు దర్శనమివ్వబోతున్నారు. ఈ పాత్ర నిడివి తక్కువగా ఉన్న గాని ఒక రెంజ్‌లో చిత్రికరించినట్లు చిత్రయూనిట్ సమాచారం. అయితే ఈ సినిమాలో చిరు గెటప్ ఎలా ఉండబోతుందనే దానికి సూచికగా ఒక ఇమెజ్ బయటకి వచ్చింది. అందులో చిరంజీవి అదిరిపోయే వాక్‌తో ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ బిగ్‌బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.