Home తాజా వార్తలు అభిమానులకు చిరు సర్ ప్రైజ్… 152వ చిత్రం ప్రారంభం

అభిమానులకు చిరు సర్ ప్రైజ్… 152వ చిత్రం ప్రారంభం

Megastar Chiranjeevi 152nd movie begins

 

మెగాస్టార్ చిరంజీవి దసరా కానుకగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన చిరు తన 152వ సినిమాని కూడా ప్రారంభించి ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. చిరు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరు భార్య సురేఖ క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమంలో చిరు తల్లి అంజనా దేవి కూడా పాల్గొన్నారు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో చిరు సరసన ఏ హీరోయిన్ నటిస్తోందని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మొదట్లో చిరుకు జోడీగా నటిస్తున్నట్లు అనుష్క, నయనతార, త్రిష పేర్లు వినిపించాయి. ఇప్పడు ఈ ఛాన్స్ గోవా సుందరి ఇలియానా కొట్టేసిందని ప్రచారం జరుగుతోంది. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తేగానీ ఈ సస్పెన్స్ వీడేట్లు లేదు.

 

Megastar Chiranjeevi 152nd movie begins