Home ఆంధ్రప్రదేశ్ వార్తలు జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి దంపతులు సమావేశమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్న చిరు దంపతులకు సిఎం దంపతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిరంజీవి, సిఎం జగన్‌కు శాలువా కప్పి సన్మానించారు. జగన్‌ను కలవడానికి ముందు చిరంజీవి దంపతులు.. విజయవాడ పటమటలోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. తాజాగా చిరంజీవి, సిఎం జగన్ ను కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, చిరంజీవికి అక్టోబర్ 11న అపాయింట్‌మెంట్ ఇచ్చిన ఏపి ప్రభుత్వం.. కొన్ని కారణాల వలన 14కు పోస్ట్ పోన్ చేసింది.

Megastar Chiranjeevi Couple meet AP CM Jagan